Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓటింగ్ కేంద్రం వద్ద విచిత్ర కంప్లైంట్.. నువ్వు కట్టించిన టాయిలెట్ బాగోలేదంటూ హీరోకి వృద్ధుడు ఫిర్యాదు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉదయాన్నే తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అక్షయ్ కుమార్ దిన చర్య తెల్లవారుజామునే నిద్రలేవ డంతో ప్రారంభం అవుతుందన్న సంగతి తెలిసిందే, అందుకే ఓటింగ్ సెంటర్‌లో అక్షయ్‌ కుమార్ ముందుగా కనిపించాడు. అయితే అక్షయ్ కుమార్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వృద్ధుడు అక్షయ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తున్నాడు.

Viral Video: ఓటింగ్ కేంద్రం వద్ద విచిత్ర కంప్లైంట్.. నువ్వు కట్టించిన టాయిలెట్ బాగోలేదంటూ హీరోకి వృద్ధుడు ఫిర్యాదు
Elderly Man Complains To Akshay Kumar
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2024 | 3:15 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో ఉదయాన్నే ఓటింగ్ కేంద్రానికి చేరుకున్న అక్షయ్ కుమార్ అక్కడ ఓటు వేశారు. అక్షయ్ మొదట ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటుడిగా గుర్తించబడ్డాడు. జుహు ఓటింగ్ సెంటర్‌లో అక్షయ్ కుమార్ డాషింగ్ లుక్‌లో కనిపించారు. ఓటింగ్ అక్షయ్ కుమారు కు ఎదురైన ఒక సంఘటనకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో అక్షయ్ కుమార్ ఓటు వేసిన తర్వాత ఓటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించాడు. ఆ సమయంలో ఒక వృద్ధుడు వెనుక నుంచి అక్షయ్ కుమార్ ని పిలిచాడు. అక్షయ్ ను ఆపి మరీ పబ్లిక్ టాయిలెట్ గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. ఈ వీడియోపై జనాలు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే పబ్లిక్ టాయిలెట్ గురించి వృద్ధుడు అక్షయ్ కుమార్‌కి ఎందుకు ఫిర్యాదు చేశాడంటే..

ఇవి కూడా చదవండి

వృద్ధుడు అక్షయ్ కుమార్‌కి ఫిర్యాదు

ఈ వీడియోను ఇన్‌స్టంట్ బాలీవుడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోలో ఒక వృద్ధుడు అక్షయ్ కుమార్‌ని ఆపి సార్ మీరు కట్టించిన టాయిలెట్ పాడైపోయింది. BMC చూసుకోవడం లేదని అతను చెప్పాడు మూడు-నాలుగేళ్లుగా అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఫిర్యాదు చేశాడు. వృద్ధుడు చెప్పిన విషయంపై స్పందించిన అక్షయ్ కుమార్ తాను BMCతో మాట్లాడతా అని హామీ ఇచ్చాడు. అయితే మీరు అమర్చిన పెట్టెలు ఐరన్‌తో చేసినవి కాబట్టి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని వృద్ధుడు పదే పదే చెప్పడం కనిపించింది. అంతేకాదు అతను మరో టాయిలెట్‌ను ఏర్పాటు చేయమని అక్షయ్‌ను కూడా అడిగాడు. అయితే దానికి అక్షయ్ ఇప్పటికే తన వంతు కృషి చేసానని ..ఇప్పుడు టాయిలెట్‌ను నిర్వహించడం BMC పని అని బదులిచ్చారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

వాస్తవానికి అక్షయ్ కుమార్ ముంబైలోని జుహు బీచ్‌లో పబ్లిక్ బయో-టాయిలెట్‌లను నిర్మించారు. అవి ఇప్పుడు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే సహాయంతో అక్షయ్ వాటిని నిర్మించాడు. ఇప్పుడు వీటి నిర్వహణపై ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు.

ప్రజల స్పందనలు వైరల్ అవుతున్నాయి

అక్షయ్ కుమార్ కు సంబందించిన ఈ వీడియోపై ప్రజలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. టాయిలెట్ 2 సినిమా వచ్చిన తర్వాత అక్షయ్ మళ్ళీ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయగలడు అని ఒకరు కామెంట్ చేయగా.. మిత్రమా ఇలా ఎవరు ఫిర్యాదు చేస్తారని మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..