Samosas: సమోసా చుట్టూ ఆ రాష్ట్ర రాజకీయాలు.. దేశంలో ఇప్పుడిదో హాట్ టాపిక్..
హిమాచల్‌లో సమోసా వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. తన కార్యక్రమంలో సమోసాలు మాయం కావడంపై సీఎం సుఖ్విందర్ సుక్కు సీఐడీ విచారణకు ఆదేశించారని ఆరోపిస్తూ బీజేపీ ఆందోనలు చేపట్టింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో సమోసా రాజకీయం సంచలనం రేపుతోంది. తనకు తెప్పించిన సమోసాలను సెక్యూరిటీ సిబ్బంది తిన్నారన్న అనుమానంతో సీఎం సుఖ్విందర్ సుక్కు సీఐడీ విచారణకు ఆదేశించారంటూ బీజేపీ మండిపడుతోంది.. ఇలా సమోసా వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శర్మ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు సమోసాలు ఆర్డర్ చేశారు. సిమ్లాలో బీజేపీ కార్యకర్తలు సమోసాలతో ఆందోళన చేపట్టారు. ఓ వైపు రాష్ట్రంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు పెరుగుతుంటే… సమోసాల అంశంలో సీఐడీ విచారణకు ఆదేశించడం విడ్డూరమన్నారు. ఇది తమను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. మరో బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్… బీజేపీ కార్యకర్తలకు సమోసా పార్టీ ఇచ్చి ఈ వివాదంపై వ్యంగ్యంగా స్పందించారు.
అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 21న సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ ఆరగించినట్లు వార్తలు వచ్చాయి. సీఎంకు చేరాల్సిన సమోసాలు ఎలా మిస్ అయ్యాయో గుర్తించేందుకు విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.. అయితే.. దీనిపై సీఎం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి. అయితే సమోసా వివాదంపై సీఎం సుక్కుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని , హిమాచల్‌ప్రదేశ్ పరువు తీస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ వివాదంపై పోలీసులు ఇప్పటికే వివరణ ఇచ్చారని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కోసం తీసుకువచ్చిన సమోసాలు తిన్న ఐదుగురు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు రాగా.. దీనిపై సీఎం వివరణ ఇచ్చారు. అధికారుల దుష్ప్రవర్తనపై విచారణ నిర్వహించారని.. అయితే, దానిని వక్రీకరించారని సుఖు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే.. ఇది అంతర్గత విషయమని.. దానిపై రాజకీయాలు అవసరం లేదని సిఐడి డైరెక్టర్ జనరల్ రంజన్ ఓజా పేర్కొన్నారు. పోలీసులకు తాము ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని.. ఎవరిపైనా చర్య తీసుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
బీజేపీ ట్వీట్..
नेता प्रतिपक्ष एवं पूर्व मुख्यमंत्री श्री जयराम ठाकुर जी ने मंडी में भाजपा पदाधिकारियों व कार्यकर्ताओं के साथ स्नेहशील भेंट की और समोसों का आनंद भी उठाया। pic.twitter.com/7JKDHFHM8G
— BJP Himachal Pradesh (@BJP4Himachal) November 8, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..