పెళ్ళికి వెళ్ళి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఆరుగురికి సీరియస్!
న్యూరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తనక్‌పూర్ హైవే ముందు షేన్ గుల్ గార్డెన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కారులో 11 మంది ఉన్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో 11 మంది ఉన్నారు. 6 మంది గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రిలో చేర్చించారు. లోని పిలిభిత్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని వ్యక్తులు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు చెట్టును ఢీకొనడంతో ఒక్కసారిగా ముక్కలైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు..
పిలిభిత్ జిల్లా న్యూరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తనక్‌పూర్ హైవే ముందు షేన్ గుల్ గార్డెన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఎర్టిగా కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారు వేగం చాలా ఎక్కువగా ఉంది. చెట్టును ఢీ కొట్టిన వెంటనే కారు ముక్కలైంది. దీంతో కారులో ఉన్న వ్యక్తులు అందులో చిక్కుకున్నారు. ఢీకొన్న శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు కారును కట్ చేసి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత రహదారికి ఇరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారులో 11 మంది ఉన్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఉన్నత కేంద్రానికి రెఫర్ చేశారు. కారులో ఉన్న వారు వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..