UP Woman Farmer : సరికొత్త పద్ధతుల్లో టమాటాలు సేద్యం చేసి.. రోజుకి 7క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న మహిళా రైతు..

ఉత్తరప్రదేశ్‌లోని విట్టల్‌పూర్‌కు చెందిన కనక లతా దుర్గ, వాసుదేవ్ పాండే దంపతులు సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి రకరకాల టమాటాలు పండిస్తున్నారు. ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి లక్షలను ఆర్జిస్తున్నారు...

UP Woman Farmer : సరికొత్త పద్ధతుల్లో టమాటాలు సేద్యం చేసి.. రోజుకి 7క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న మహిళా రైతు..
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2021 | 6:18 PM

UP Woman Farmer : ఉత్తరప్రదేశ్‌లోని విట్టల్‌పూర్‌కు చెందిన కనక లతా దుర్గ, వాసుదేవ్ పాండే దంపతులు సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి రకరకాల టమాటాలు పండిస్తున్నారు. ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి లక్షలను ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కనక లతా భర్త వాసుదేవ్ పాండే ఒక సహకార బ్యాంకు లో ఉద్యోగం చేసి 2017 లో రిటైర్ అయ్యారు. తరువాత ఈ జంట తమ కొడుకుతో కొన్ని నెలలు గడపడానికి USA కి వెళ్లారు. కొంతకాలం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్టల్‌పూర్ గ్రామంలో తమ శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే వాసుదేవ్ కు వచ్చే పెన్షన్ సరిపోకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ.. తమ 1.5 ఎకరాల వ్యవసాయ భూములలో వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకున్నారు.

ఇద్దరి కుటుంబాలు వ్యవసాయం నేపథ్యనికి చెందినవే.. అయితే వ్యవసాయం చేసిన అనుభం లేదు.. మొదట్లో వ్యవసాయం చేయడం తెలియక పోవడంతో పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో కనకలత పంట దిగుబడి పెరగాలంటే.. సారవంతమైన భూమి ఉండాలని కొంతమంది రైతుల సలహాలతో మళ్ళీ తక్కువ భూమిలో కూరగాయలు పండించడం మొదలు పెట్టారు.  ఇలా కొన్ని అనుభవాల తర్వాత కనక లత తన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానాన్ని అనుసరించి టమాటా సాగును మొదలు పెట్టారు. ఇప్పుడు వారి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు సమీప మార్కెట్లలో డిమాండ్ పెరగడమే కాకుండా, యుకె , ఒమన్ లకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడానికి కానక అనేక ప్రయత్నాలు చేసారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఆధ్వర్యంలో నవ చేతన అగ్రో సెంటర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను సంప్రదించారు. సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ పొందిన కనకతన పొలంలో అవసరమైన మార్పులు చేశారు. ఇందుకోసం ఆమె .50 వేలు అప్పుగా తీసుకున్నారు. సరికొత్త పద్దతిలో నిల్వ ఉండే టమాటాలు దుర్గ, అర్యమాన్ రకాలను ఆగష్టు 2020లో నాటారు. పంట దిగుబడి కోసం భూమిని సేంద్రియ ఎరువు, వర్మి కంపోస్ట్ లతో సారవంతం చేశారు.

ఇప్పుడు ఆ టమాటా ఒక కేజీ 100 పలు పలుకుతుంది. తాను పండిస్తున్న ఈ టమోటాల్లో పుల్లదనం తక్కువ అని.. జ్యుసీగా ఉంటాయని చెప్పారు. అనేకాదు.. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని తెలిపారు కనక ఈ టమోటాలు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకుండా కనీసం రెండు వారాల పాటు ఉంటాయి. ఇతర దేశీ రకాలతో పోల్చితే ఇవి పొడవుగా, గుండ్రంగా ఉంటాయని హార్టికల్చర్ ఆఫీసర్ తెలిపారు.

ఇప్పుడు తాను పెట్టిన పెట్టుబడి వచ్చిందని.. ఇక నుంచి లాభాల బాట పడతానని కనకలత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టమోటాలను రాజ్‌భవన్‌కు పంపించగా వాటిని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ప్రశంసించారు. అంతేకాదు కనక వ్యవసాయం లో సాధించిన విజయం ఈ ప్రాంతంలోని ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిచ్చిందని ముఖేష్ చెప్పారు. మిగతా రైతులు కూడా నెక్స్ట్ సీజన్ లో టమోటా లో ఈ రకాలను పెంచుతారని అన్నారు. అయితే తాను ఇక నుంచి క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్ మరియు బ్లాక్ టమోటాలతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చుపిస్తున్నానని చెప్పారు కనకలత

Also Read:

Airavatesvara Temple : సైన్స్ కు అందని అద్భుతం ఈ ఆలయం.. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి

 భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?