Drugs Ediction: ముంబైని దాటేసిన ఢిల్లీ.. డ్రగ్స్ వినియోగంలో దేశరాజధాని ప్రపంచంలోనే మూడో పెద్ద సిటీ.. న్యూయార్క్ టాప్

ప్రపంచంలో డ్రగ్స్ వినియోగంలో టాప్ టెన్ నగరాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ చేరింది. గతంలో డ్రగ్స్‌కి కేంద్రంగా భావించే ముంబయిని వెనక్కి పడేసిన న్యూఢిల్లీ..

Drugs Ediction: ముంబైని దాటేసిన ఢిల్లీ.. డ్రగ్స్ వినియోగంలో దేశరాజధాని ప్రపంచంలోనే మూడో పెద్ద సిటీ.. న్యూయార్క్ టాప్
Follow us

|

Updated on: Mar 09, 2021 | 5:49 PM

New Delhi crossed Mumbai city in Drugs consumption: ప్రపంచంలో డ్రగ్స్ వినియోగంలో టాప్ టెన్ నగరాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ చేరింది. గతంలో డ్రగ్స్‌కి కేంద్రంగా భావించే ముంబయిని వెనక్కి పడేసిన న్యూఢిల్లీ.. ప్రపంచంలో డ్రగ్స్ వినియోగిస్తున్న నగరాల్లో టాప్ త్రీగా నిలిచింది. తాజాగా డ్రగ్స్ వాడుతున్న ప్రపంచంలోని టాప్‌-10 నగరాల జాబితాను జర్మనీకి చెందిన ఏబీసీడీ అనే అధ్యయనం సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికాలో ప్రధాన నగరం న్యూయార్క్ తొలి స్థానంలో నిలువగా.. న్యూఢిల్లీ మూడోస్థానంలో నిలిచింది.

దేశ రాజధాని న్యూఢిల్లీ మూడో స్థానంలో వుండగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానంలో వుంది. ప్రతీ ఏటా 34 వేల 708 కిలోల డ్రగ్స్‌ ఢిల్లీవాసులు వినియోగిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఆరో స్థానంలో వున్న ముంబయి నగరంలో ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగం డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిపింది జర్మనీకి చెందిన ఏబీసీడీ అనే సంస్థ. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్‌ వినియోగిస్తున్న నగరాల్లో న్యూయార్క్‌ నగరం మొదటి స్థానంలో వుంది. ప్రతి ఏటా 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు న్యూయార్స్ వాసులు. ఆ తర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ వుంది. కరాచీ వాసులు ప్రతీ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు. నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి.

ఇక నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీబీ) గణాంకాల ప్రకారం 2015 -2019 మధ్య దేశవ్యాప్తంగా 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని ఎన్‌సీబీ సీజ్ చేసింది. 2019లో పట్టుబడిన మాదక ద్రవ్యాలు 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువేనని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. 35,310 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలున్నారు. 2018లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 2019లో డ్రగ్స్‌ కారణంగా 8,564 మంది మృతి చెందారు. డ్రగ్స్ కారణంగా 7,860 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మృతి చెందుతున్నారని ఎన్‌సీబీ గణాంకాలు చెబుతున్నాయి.

పోలీసులకు పట్టు బడ్డ కొన్న డ్రగ్స్ కేసులు…

# జూన్‌ 27, 2020 జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలో రూ.65 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత # జులై 13, 2020 ముంబయికి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీసులు.. కారులో 2 కిలోల బరువున్న 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం # జులై 20, 2020 గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన కోల్‌క‌తా పోలీసులు # జులై 28, 2020 హర్యానాలోని గురుగ్రామ్‌లో లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలతోపాటు కరోనా మందుల పట్టివేత, ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు # ఆగస్టు 16, 2020 ఉత్తర గోవా వాగేటర్‌లోని ఓ విల్లాలో రూ. 9 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం, ముగ్గురు విదేశీయులతో సహా 23 మంది అరెస్టు # ఆగస్టు 20, 2020 హైదరాబాద్‌ జిన్నారం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్‌ ల్యాబ్‌ లో రూ. 81 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం # అగస్టు 25, 2020 బెంగళూరులో రామ‌ బాబు అనే వ్య‌క్తి నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు # సెప్టెంబర్‌ 1, 2020 ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌హ‌రాజ్‌గంజ్ జిల్లాలోని సోనాలి వ‌ద్ద కోటి రూపాయ‌ల హెరాయిన్ ప‌ట్టివేత # సెప్టెంబర్‌ 4, 2020 డ్రగ్స్ మాఫియా కేసులో బెంగళూరులో నటీమణులు రాగిణి, సంజనా గల్రానీ అరెస్ట్‌ # సెప్టెంబర్‌ 5, 2020 మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్‌ మాల్వా జిల్లా సుస్న‌ర్ ప‌ట్ట‌ణంలోరూ.8 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్ద‌రు అరెస్టు # సెప్టెంబర్‌ 6, 2020 ముంబయిలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టివేత # సెప్టెంబర్‌ 15, 2020 కర్నాటక డ్రగ్స్ కేసులో నిందితుడు ఆదిత్య ఆల్వా ఇంటిపై పోలీసుల దాడులు, ఆదిత్య మాజీ మంత్రి, దివంగత జీవిత రాజ్‌ ఆల్వా కుమారుడు # సెప్టెంబర్‌ 23, 2020 హైదరాబాదులోని నల్లకుంటలో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న రాజ‌స్థాన్‌కు చెందిన‌ దినేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు # సెప్టెంబర్‌27, 2020 అస్సాంలోని చందేల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రూ.6.4 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అస్సాం రైఫిల్స్‌ # సెప్టెంబర్‌ 28, 2020 హైద‌రాబాద్‌లో ఐదుగురు సభ్యుల డ్ర‌గ్స్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, 155 గ్రాముల‌ నిషేధిత హ‌షీస్ ఆయిల్‌ స్వాధీనం # సెప్టెంబర్‌29, 2020 బెంగ‌ళూరు డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ్యాన్స‌ర్, కొరియోగ్రాఫ‌ర్ కిశోర్ అమ‌న్ శెట్టి అరెస్ట్ # అక్టోబర్‌ 15, 2020 బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ ఇంట్లో బెంగ‌ళూరు పోలీసులు సోదాలు # అక్టోబర్‌ 25, 2020 ముంబైలో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా ఎన్‌సీబీ చేతికి చిక్కిన నటి ప్రీతికా. # అక్టోబర్‌ 26, 2020 మ‌హారాష్ర్ట‌లోని పుణెలో రూ.10.6 ల‌క్ష‌ల విలువ చేసే మెఫిడ్రోన్ అనే డ్ర‌గ్‌ స్వాధీనం # నవంబర్‌ 13, 2020 డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట హాజరైన నటుడు అర్జున్‌ రాంపాల్‌ # నవంబర్‌ 20, 2020 డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు # నవంబర్‌ 24, 2020 హైదరాబాద్‌ నాచారం హెచ్‌ఎంటీ నగర్‌లో డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ # నవంబర్‌ 24, 2020 యెమెన్‌, బెంగళూరు, ధూల్‌పేట కేంద్రంగా నగరంలో పలు రకాల మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు # నవంబర్‌ 25, 2020 హైదరాబాద్‌ నగరంలో వేరు వేరే చోట్ల డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్ # నవంబర్‌ 27, 2020 డ్రగ్స్‌ తీసుకున్నారనే ఆరోపణలతో కమెడియన్‌ భారతీ సింగ్‌ను, ఆమె భర్త హర్ష్‌ లింబాచియాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు # డిసెంబర్‌ 9, 2020 బెంగళూర్ రైల్వే స్టేషన్‌లో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాదీనం భారతీయ మహిళ సహా ఓ నైజీరియన్‌ అరెస్ట్ # డిసెంబర్‌ 9, 2020 హైదరాబాద్‌ మెహీదీపట్నంలో డ్రగ్స్ అమ్ముతున్న టెకీ అరెస్ట్ # డిసెంబర్‌ 13, 2020 పంజాబ్‌లోని జలంధర్‌లో 4 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు # డిసెంబర్‌ 22, 2020 కేరళలోని వాగామోన్‌లో ఓ రిసార్ట్‌లోడ్రగ్స్ స్వాధీనం, తొమ్మిది మంది అరెస్టు # డిసెంబర్‌ 19, 2020 హైదరాబాద్ ఎయిర్‌ పోర్టులో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు # జనవరి 2, 2021 హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన ముంబైవాసి అరెస్ట్,12 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం # జనవరి 6, 2021 డ్రగ్స్‌ కేసులో కన్నడ నటి శ్వేతాకుమారి అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు # జనవరి 30, 2021 కర్నాటకలోని బెంగళూర్‌ రామ్మూర్తి నగర్‌లో రూ.75 లక్షల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసులు # ఫిబ్రవరి 18, 2021 హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరాకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు # ఫిబ్రవరి 24, 2021 కేరళలో డ్రగ్స్‌, సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు, ఆన్‌లైన్‌లో బాలికలతో స్నేహం చేస్తూ వారికి డ్రగ్స్‌ను అలవాటు చేసి లైంగికంగా వేధిస్తున్న ముఠా

ALSO READ: దేశంలో శరవేగంగా ప్రైవేటైజేషన్.. పీఎస్యూలు, లిస్టెడ్ కంపెనీలు.. అన్నింట్లోంచి వాటా విక్రయం

ALSO READ: పెట్టుబడుల ఉపసంహరణ ఆగదంటున్న కేంద్రం.. ఇప్పటి వరకు డిజిన్వెస్టుమెంటు ప్రాసెస్ ఇదే!

ALSO READ: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?