UP BJP chief: దళితులతో కలిసి టీ, భోజనం చేయాల్సిందే.. బీజేపీ కార్యకర్తలకు యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ హుకుం జారీ!

వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల‌కి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లో సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు ప‌న్నుతోంది.

UP BJP chief: దళితులతో కలిసి టీ, భోజనం చేయాల్సిందే.. బీజేపీ కార్యకర్తలకు యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ హుకుం జారీ!
Up Bjp Chief Swatantra Dev Singh
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:23 PM

UP BJP chief Swatantra Dev Singh: వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల‌కి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లో సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు ప‌న్నుతోంది. తాజాగా వారి లెక్కలు వారికి ఉంటే.. స‌ర్వేలు కూడా వారికే ఫేవ‌ర్‌గా ఉండ‌టంతో మరింత జోష్‌గా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఒక్క అడుగు ముందుకేసి.. వెనుకబడిన తరగతుల (ఓబిసి), అగ్రవర్ణ వర్గాల పార్టీ కార్యకర్తలను దళితులతో కలిసి టీ, భోజనం చేయాలని, జాతీయవాద సమస్యపై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయాలని వారిని ఒప్పించాలని పిలుపునిచ్చారు. .యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ OBC సామాజిక ప్రతినిధి సమ్మేళనం, వైశ్య వ్యాపారి సమ్మేళన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు వెళ్లి..10 నుండి 100 దళిత కుటుంబాలతో వారి పరిసరాలు, గ్రామాల్లో టీ తాగాలని పార్టీ కార్యకర్తలను కోరారు. కులం, ప్రాంతం, ధనిక, పేద పేరుతో ఓటు వేయడం కాదని, జాతీయవాదం పేరుతో ఓటు వేయాలని వారిని ఒప్పించాలన్నారు.

అంతకుముందు, పార్టీ OBC మోర్చా నిర్వహించిన సామాజిక ప్రతినిధి సమ్మేళన్‌లో స్వతంత్ర సింగ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల మధ్యకు వెళ్లాలని.. దళితులు, దోపిడీకి గురైన, అణగారిన కుటుంబాలకు చెందిన వెయ్యికి పైగా ఇళ్లలోకి వెళ్లాలన్నారు. అక్కడి వెళ్లిన వారికి అక్కడ మీకు టీ అందిస్తే, వారితో మీ బంధం బాగానే ఉందని, ఇక టీతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తే ఆ కుటుంబం బీజేపీతో జతకట్టినట్లు ఖాయమన్నారు. ఒక ఇంటిని 10 రోజుల పాటు సందర్శించి, మీకు టీ అందించకపోతే, అక్కడి నుండి వారు తరిమివేసినా, అక్కడ టీ అందించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు వెయ్యి సార్లు వాళ్ల ఇంటికి వెళ్లాలి. దీనివల్ల పార్టీని బలోపేతం చేస్తాయన్నారు.

Read Also: Sharukh Khan: తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. రెడ్ చిల్లీస్‌కి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్