AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఈ నెల ద్వితీయార్థంలో బ్యాంకు సెలవులు ఇవే..

వినాయక చవితితో మొదలైన ఫెస్టివల్‌ సీజన్‌ ఇంకా కొనసాగుతోంది. దసరా, దీపావళి అంటూ వరుసగా పండగలు రావడంతో బ్యాంకులకు కూడా భారీగా సెలవులు  వచ్చాయి...

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఈ నెల ద్వితీయార్థంలో బ్యాంకు సెలవులు ఇవే..
Basha Shek
|

Updated on: Nov 15, 2021 | 12:59 PM

Share

వినాయక చవితితో మొదలైన ఫెస్టివల్‌ సీజన్‌ ఇంకా కొనసాగుతోంది. దసరా, దీపావళి అంటూ వరుసగా పండగలు రావడంతో బ్యాంకులకు కూడా భారీగా సెలవులు  వచ్చాయి.  నవంబర్‌ ప్రథమార్థంలో దీపావళికి తోడు భాయ్‌ దూజ్‌, ఛాత్‌ పూజ, కార్తీక పౌర్ణమి తదితర పర్వదినాలు వరసగా వచ్చాయి. దీంతో మొదటి రెండు వారాల్లో ఏకంగా 11 రోజులు బ్యాంకులు పనిచేయలేదు. అయితే ఈనెల ద్వితీయార్థంలో మాత్రం సెలవులు తక్కువగానే ఉన్నాయి. వారాంతాలు కలిపి మొత్తం ఆరు రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఈ సెలవులు ఉన్నాయి.

ఉదాహరణకు వచ్చే సోమవారం (నవంబర్‌ 22)న కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరు పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పనిచేయవు. మిగతా రాష్ట్రాల్లో యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. అంతకుముందు నవంబర్‌ 19న గురునానక్‌ జయంతి / కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లోని బ్యాంకులు పనిచేయవు. ఇక నవంబర్‌ 23న సెంగ్ కుట్స్‌నెమ్ ఉత్సవాల సందర్భంగా మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌ పరిధిలోని బ్యాంకులకు మాత్రమే సెలవు ఉంటుంది మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు తెరచే ఉంటాయి. అదేవిధంగా నాలుగో శనివారం సందర్భంగా నవంబర్‌ 27న అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

ఈ నెల ద్వితీయార్థంలో బ్యాంకు హాలీడేస్.. నవంబర్ 19, 2021: గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ నవంబర్ 21, 2021 – ఆదివారం నవంబర్ 22, 2021: కనకదాస జయంతి నవంబర్ 23, 2021: సెంగ్ కుట్స్‌నెమ్ నవంబర్ 27, 2021 – నాల్గవ శనివారం నవంబర్ 28, 2021 – ఆదివారం

Also Read:

Survival Game: అత్యంత చల్లనైన ప్రదేశంలో మనుగడ కోసం స్కేట్‌బోర్డింగ్ ప్రాక్టీస్.. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..

Brahmastra S-400: రష్యా నుంచి మొదలైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా.. అమెరికా వ్యతిరేకతనూ పట్టించుకోని భారత్!