Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..

Historian Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు.

Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..
Babasaheb Purandare
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 15, 2021 | 12:26 PM

Babasaheb Purandare Passed Away: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండు రోజుల క్రితం ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సపోర్టుపై ఉన్న ఆయన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బాబాసాహెబ్‌కు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

మహారాష్ట్రలోని బల్వంత్ మోరేశ్వర్ పురందరేగా జన్మించిన బాబాసాహెబ్ ఛత్రపతి శివాజీపై అనేక పుస్తకాలను రచించారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. అతను 2019 లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, 2015 లో మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం. 200 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన ‘జాంత రాజా’ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. ఐదు భాషలలో అనువదించి రూపొందించారు. ఈ నాటకానికి దేశ వ్యాప్తం ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

పురందరే మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నాకు చెప్పలేనంత బాధ కలిగింది. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో ఒక పెద్ద శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. బాబాసాహెబ్ పురందరే చమత్కారుడు, తెలివైనవాడు, భారతీయ చరిత్ర గురించి గొప్ప జ్ఞానం కలిగిన వేత్త. కొన్నేళ్లుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు దక్కింది. కొన్ని నెలల క్రితం, తన శతాబ్ది సంవత్సర కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన భౌతికంగా లేకున్నా , అతని రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అంటూ ట్విట్టర్ వేదిక ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Read Also…. Brahmastra S-400: రష్యా నుంచి మొదలైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా.. అమెరికా వ్యతిరేకతనూ పట్టించుకోని భారత్!