Survival Game: అత్యంత చల్లనైన ప్రదేశంలో మనుగడ కోసం స్కేట్‌బోర్డింగ్ ప్రాక్టీస్.. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

మనకి 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదింది అంటే చాలు.. వణికి పోతాం. బాబోయ్ చలి అంటూ చలి మంటల వైపు.. వెచ్చని ఉన్ని దుస్తుల వైపు పరుగులు తీస్తాం. మన వాతావరణానికి అది చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రత.

Survival Game: అత్యంత చల్లనైన ప్రదేశంలో మనుగడ కోసం స్కేట్‌బోర్డింగ్ ప్రాక్టీస్.. ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
Survival Game At Dras
Follow us

|

Updated on: Nov 15, 2021 | 12:41 PM

Survival Game: మనకి 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదింది అంటే చాలు.. వణికి పోతాం. బాబోయ్ చలి అంటూ చలి మంటల వైపు.. వెచ్చని ఉన్ని దుస్తుల వైపు పరుగులు తీస్తాం. మన వాతావరణానికి అది చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రత. అదే మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే? ఇంకేమన్నా ఉందా.. అసలు మనిషి అనేవాడు బతికి ఉంటాడా? అనే అనుమానం వస్తుంది. కానీ, అటువంటి అత్యంత చల్లని ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ ఎండాకాలంలో మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక శీతాకాలం అది మైనస్ 60 డిగ్రీలు అవుతుంది. ప్రపంచంలోనే జనాలు తిరుగాడే అత్యంత శీతల ప్రదేశం సైబీరియా. దీని తరువాత రెండో జనావాస అతి శీతల ప్రదేశం ద్రాస్. ఇది మన దేశంలోనే ఉంది. కార్గిల్ కి దగ్గరలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇంత చలి ప్రదేశంలో దాదాపు 25 వేలమంది ప్రజలు నివసిస్తున్నారు. పై ఫోటో చూశారుగా ఇది అక్కడి పిల్లలు మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నపుడు స్కేట్‌బోర్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల చిత్రం. ఇక్కడ పిల్లలకు ఇదే ఏకైక ఆట విడుపు. ఇక్కడ ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే, ఆ చలిలో మనుగడ సాగించాలంటే స్కేట్‌బోర్డింగ్ తప్ప మరో మార్గం లేదని చెబుతారు స్థానికులు. పిల్లలు వేసే మొదటి అడుగే మంచు మీద. మరి ఆ మంచులో కదలాలంటే స్కేట్‌బోర్డింగ్ వచ్చి ఉండాల్సిందే కదా అంటాడు అక్కడి స్థానికుడు జహూర్ అహ్మద్. పిల్లలు స్కేట్‌బోర్డింగ్ ఆడుకునే ప్రాంతంలో 5 నుండి 10 అడుగుల వరకు మంచు ఉంటుంది. ఇక్కడి ప్రజలకు ఇది మనుగడ ఆట కూడా. అంటే ప్రాణం నిలవాలంటే మంచును తోడుగా చేసుకోవాలి. మంచు క్రీడలకు సంబంధించిన పదార్థాలు ఖరీదైనవి. అందుకోసం మెటల్ పైపులు, పలకలను కలపడం ద్వారా స్కేట్‌బోర్డ్‌లను తయారు చేసుకుంటారు. వీటితో స్కేటింగ్ చేస్తూ.. కింద పడినపుడల్లా పాఠాలు నేర్చుకుంటూ వీరు చాంపియన్లుగా మారతారు. దేశ మహిళా ఐస్ హాకీ జట్టులో ఎక్కువ మంది క్రీడాకారులు ఇక్కడి వారే.

ఇక్కడి బాలికలు స్కేటింగ్-స్కీయింగ్‌లో చురుకుగా పాల్గొంటారు. వారు ఐస్ హాకీ టోర్నమెంట్లలో పాల్గొంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతం ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలకు చేరుకుంటుంది. అయితే, పిల్లలు, యువకులు స్వేచ్ఛగా మంచు క్రీడలను ఆనందిస్తారు.

ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!

PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ

New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!

Latest Articles