PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ

దేశ సమగ్రాభివృద్ధిని ముక్కలు ముక్కలుగా చూడటం.. రాజకీయ కోణంలో పరిశీలించడం గతంలో ఉండేది. అందుకే మన ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని ప్రధాని మోడీ అన్నారు.

PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ
Pm Modi
Follow us
KVD Varma

|

Updated on: Nov 14, 2021 | 2:33 PM

PMAY-G: దేశ సమగ్రాభివృద్ధిని ముక్కలు ముక్కలుగా చూడటం.. రాజకీయ కోణంలో పరిశీలించడం గతంలో ఉండేది. అందుకే మన ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని ప్రధాని మోడీ అన్నారు. త్రిపురలోని 1.47 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీని కింద 700 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, గత ప్రభుత్వాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”అభివృద్ధి ఇప్పుడు దేశ ఐక్యత, సమగ్రతకు పర్యాయపదంగా మారింది. ఇంతకు ముందు మూసిఉన్న గదుల్లో పాలసీలు చేసేవారు. ఇప్పుడు ఢిల్లీఅనే కాకుండా స్థానిక అవసరాన్ని బట్టి పాలసీలు తయారవుతున్నాయి. త్రిపురలోని లక్షలాది కుటుంబాల ముందు పక్కా ఇళ్లకు సంబంధించి కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే, త్రిపుర భౌగోళిక పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకుంది. దానికి అనుగుణంగా విధానాలు రూపొందించింది.” అంటూ ప్రధాని మోడీ చెప్పారు.

త్రిపుర అభివృద్ధికి రాష్ట్రం-కేంద్రం కలిసి పని చేస్తున్నాయి..

ఇప్పుడు అగర్తలా, ఢిల్లీ రెండూ కలిసి విధానాలను రూపొందిస్తున్నాయని, కష్టపడి పని చేసి త్రిపుర అభివృద్ధికి ఫలితాలు తీసుకువస్తున్నాయని మోడీ అన్నారు. ”మీరు చూడండి, గత 4 సంవత్సరాలలో, త్రిపురలోని గ్రామాలలో సుమారు 50 వేల కుటుంబాలకు ప్రధానమంత్రి-ఆవాస్ పథకం కింద పక్కా గృహాలు ఇచ్చారు. దాదాపు 1.60 లక్షల కొత్త ఇళ్లు మంజూరయ్యాయి. ఈ రోజు మొదటి విడత కూడా దాదాపు 1.5 లక్షల కుటుంబాలకు విడుదల చేశాము. అది కూడా ఒక బటన్ నొక్కి.” అని ప్రధాని మోడీ అన్నారు.

PMAY-G పథకం అంటే ఏమిటి?

PMAY-G అనేది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. నిరాశ్రయులైన వారికి సొంత ఇళ్ళను అందించడమే దీని ఉద్దేశం. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా