AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!

మీ చుట్టూ జనం ఉన్నారు. వారి మధ్యలో మీరు ఉన్నారు. మీ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. అప్పుడు మీ పక్కన కూచున్న వారు మీ ఫోన్ చూడటం జరిగే ఛాన్స్ ఉంది.

New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!
Smartphone Technology
KVD Varma
|

Updated on: Nov 14, 2021 | 2:20 PM

Share

New Technology: మీ చుట్టూ జనం ఉన్నారు. వారి మధ్యలో మీరు ఉన్నారు. మీ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. అప్పుడు మీ పక్కన కూచున్న వారు మీ ఫోన్ చూడటం జరిగే ఛాన్స్ ఉంది. మీరు ఆ సమయంలో ఏదైనా బ్యాంకు లావాదేవీ నిర్వహిస్తుంటారు.సున్నితమైన సమాచారం స్మార్ట్‌ఫోన్‌ లో మెసేజ్ చేస్తూ ఉండవచ్చు. అది మీ పక్కన ఉన్న అపరిచితులు చూడటం మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగించే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. అవును. మీరు వందమందిలో కూచున్నా.. మీ స్మార్ట్‌ఫోన్‌ లో మీరు ఏమి చూస్తున్నారు అనేది మీకు తప్ప ఎవరికీ కనిపించదు. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) స్క్రీన్‌పై కంటెంట్‌ని చూడకుండా ఇతరులను నిరోధించే గ్లాసెస్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ పేరు ప్రైవసీ ఐవేర్. ఇది మీరు ధరించినప్పుడు మాత్రమే మీ ఐఫోన్(iPhone)లో ఆన్-స్క్రీన్ కంటెంట్‌ కనిపిస్తుంది. దీని వలన మీ పక్కన కూర్చున్న వ్యక్తులు మీ స్క్రీన్ కంటెంట్‌ను చూడలేరు. అంటే వారికి మీ స్క్రీన్ పై ఏమీ కనిపించదు.

పేటెంట్ కోసం చేసిన దరఖాస్తు నుంచి.. యూఎస్ పేటెంట్.. ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (USPTO)లో ఆపిల్ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం బహిర్గతం అయింది. ఈ దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడు స్క్రీన్‌ను బ్లర్ చేయగలుగుతారు.స్మార్ట్‌ఫోన్ గ్లాసెస్‌పై ప్రామాణిక గ్రాఫికల్ అవుట్‌పుట్‌ను పొందుతుంది. దీంతో మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాక్టివిటీ చేసినా అద్దాల ద్వారానే కనిపిస్తుంది. ఇందులో, వినియోగదారులు కావాలనుకుంటే, వారు కాలిబ్రేషన్ గ్రాఫిక్స్ ఎంపికతో స్క్రీన్‌ను కూడా బ్లర్ చేయవచ్చు.

దీనితో పాటు, ఆపిల్ యూజర్ కోసం ఫేస్ ఐడి ప్రొఫైల్‌పై కూడా పని చేస్తోంది. ఇది కాకుండా, ఇతర వినియోగదారులు వారి హెయిర్ స్టయిల్, మీసం, గడ్డం, సన్ గ్లాసెస్ అలాగే, రీడింగ్ గ్లాసెస్ మొదలైన వాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో సహాయపడే ఒక ఫీచర్ పై కూడా ఆపిల్ పని చేస్తోంది. ఆపిల్ ఈ రెండు పేటెంట్లను ఏకీకృతం చేసే అవకాశం ఉంది.

ప్రైవసీ గ్లాసెస్ ప్రయోజనం ఏమిటంటే మీరు మినహా అందరి నుండి స్క్రీన్ కంటెంట్‌ను రక్షించడం. అలాగే బస్ స్టాప్ లేదా మెట్రో స్టేషన్‌లో ఫోన్‌లో ఆన్‌లైన్ లావాదేవీల పాస్‌వర్డ్ లేదా అవసరమైన పత్రాలు పక్కన కూచున్న వారికి కనిపించే అవకాశం లేకపోవడంతో సురక్షితంగా మీ కంటెంట్ కాపడుకోగలుగుతారు.

ఇప్పటివరకూ ఆపిల్ ఫోన్ తొలిసారిగా అద్భుతమైన టెక్నాలజీ ఫీచర్లు ఇవే..

1. ఫింగర్‌ప్రింట్ స్కానర్

స్మార్ట్‌ఫోన్ iPhone 5s లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ 2013లో ప్రారంభించారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను తీసుకువచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.

2. మల్టీటచ్ ఫీచర్

మల్టీటచ్ టెక్నాలజీ 2007లో ప్రవేశపెట్టారు. మీరు ఫోటోను జూమ్ అవుట్ చేయడానికి పించింగ్ కదలికలో వేళ్లను కలిపినప్పుడల్లా, దానిని మల్టీటచ్ ఫీచర్ అంటారు. ఐఫోన్‌లో ఆపిల్ మొదట ఈ టెక్నాలజీని ఉపయోగించింది.

3. గొరిల్లా గ్లాస్

గొరిల్లా గ్లాస్ ఉపయోగం సన్నని డిస్ప్లేను ఉపయోగించినప్పటికీ, దాని బలం అలాగే ఉంది. అలాగే, తెరపై ఎలాంటి గీతలు పడవు. ఆపిల్ గొరిల్లా గ్లాస్‌ను ఉపయోగించే ట్రెండ్‌ను ప్రారంభించింది.

4. USB పోర్ట్‌లు

iMacలో USB రావడంతో, USB పోర్ట్‌లకు మద్దతు ఇచ్చే కంప్యూటర్‌ల సంఖ్య మార్కెట్ అంతటా పెరగడం ప్రారంభమైంది.

5. ట్రాక్‌ప్యాడ్

ఈ రోజుల్లో చాలా ల్యాప్‌టాప్‌లు ట్రాక్‌ప్యాడ్‌లను కలిగి ఉన్నాయి. Apple మొదటిసారిగా 1994 మేలో పవర్‌బుక్ 500 నోట్‌బుక్‌ల శ్రేణితో రెండు అంగుళాల ట్రాక్‌ప్యాడ్‌ను ఉపయోగించింది.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!