కేంద్ర మంత్రి మేనల్లుడు ఆత్మహత్య.. ప్రాపర్టీ డీలర్ గా పని చేస్తున్న మృతుడు నందకిషోర్..
బుధవారం ఉదయం నంద్ కిషోర్ తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కి సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లే లోపుగానే నందకిషోర్ మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు.
కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మేనల్లుడు నంద్ కిషోర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీ రాజధాని లక్నోలోని దుబగ్గలోని బిగారియా ప్రాంతంలో తన నివాసంలో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కౌశల్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి మేనల్లుడు నందకిషోర్ ప్రాపర్టీ డీలర్ గా పని చేస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
దుబగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నంద్ కిషోర్ తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కి సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లే లోపుగానే నందకిషోర్ మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలంటనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నందకిషోర్ సూసైడ్‌కు గల కారణాలు తెలియరాలేదు. బంధువులు కూడా ఏం చెప్పలేకపోయారని.. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
అయితే, నంద కిషోర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇద్దరు భార్యల్లో ఒకరు ముస్లిం కాగా.. మరొకరు హిందువు అని సమాచారం. ఆయన మొదటి భార్య షకీలా ద్వారా ఆయనకు అఫ్జల్, సాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్యకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు విశాల్, ఆదర్శ్, కుమార్తెలు అన్షిక, శిఖ ఉన్నారు. అయితే తన తండ్రి కొన్ని రోజులుగా పలు ఇబ్బందులు పడుతున్నాడని కుమారుడు విశాల్ తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్ లోని మోహన్‌లాల్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. చదువుకున్న అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి రాకూడదని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి