సూట్ కేసులో దాక్కున్న అనుకోని అతిథి.. ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల్లో బయటపడ్డ అవే కళ్లు..!

ఓ ప్రయాణికుడి లగేజీలో ఊహించని అతిథి కనిపించడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ అనుకోని అతిథి ఎలా సూట్‌కేస్‌లోకి వచ్చిందో అర్థంకాకపోవటంతో అందరూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

సూట్ కేసులో దాక్కున్న అనుకోని అతిథి.. ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల్లో బయటపడ్డ అవే కళ్లు..!
Cat Snuck
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 23, 2022 | 6:11 PM

ఏ ఎయిర్‌పోర్టులోనైనా సరే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు సహజం.. అయితే, ఇక్కడ ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఎయిర్‌పోర్టు సిబ్బంది రోజువారి తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకుల లగేజీ బ్యాగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు..ఎయిర్‌పోర్ట్‌లోని భద్రతా విభాగం ఎక్స్‌రే మిషన్‌తో చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడి లగేజీలో ఊహించని అతిథి కనిపించడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ అనుకోని అతిథి ఎలా సూట్‌కేస్‌లోకి వచ్చిందో అర్థంకాకపోవటంతో అందరూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Cat In Airport

న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్‌ సూట్‌కేస్‌లో పిల్లి కనిపించింది. ప్రయాణికుడి లగేజీని ఎక్స్-రే తనిఖీ గురిచేయగా ఊహించని ఘటన భద్రతా విభాగం దృష్టికి వచ్చింది. ఎక్స్ రే పరీక్షలో ఆ సూట్‌కేస్‌లో నారింజ రంగు పిల్లి కనిపించింది. డెల్టా ఎయిర్‌లైన్ విమానంలో ప్రయాణీకుల సామానులో పిల్లిని గుర్తించిన సిబ్బంది అవాక్కయ్యారు. సదరు ప్రయాణికుడు ఫ్లోరిడాలోని ఓర్లాండోకు వెళ్తున్నాడు.. కానీ, వారి పొరుగింటి పిల్లి బ్యాగ్‌లోకి ఎలా వచ్చిందో అతనికి కూడా తెలియదు. పిల్లి ప్రయాణానికి అంతరాయం కలిగించినా.. లగేజీలో దాచుకున్న పిల్లిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. భద్రతా విభాగం ట్విటర్‌లో ఎక్స్‌రే పరీక్ష చిత్రాలను షేర్ చేసింది. ఎక్స్ రే పరీక్షలో బ్యాగులో వైన్ గ్లాస్, పలు వైన్ బాటిళ్లు, చెప్పులు కనిపించాయి.

పెంపుడు జంతువులను ఎక్స్-రే తనిఖీ చేయకూడదని ఇక్కడ విమానాశ్రయ భద్రతా విభాగం నియంత్రణలో పేర్కొంది. 2021లో జరిగిన మరో సంఘటనలో టెక్సాస్ విమానాశ్రయంలో బూట్‌లో దాక్కున్న కుక్కపిల్ల కనుగొనబడింది. కుక్క పిల్ల బూట్ లోపల నిద్రపోతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి