Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్ర తీరంలో వింతజీవి హల్‌చల్‌.. ఏలియన్‌ అంటున్న స్థానికులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు..

దాని ఒంటి నిండా ముళ్ళు, వెంట్రుకలు. ఇది మధ్యలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ, బంగారు రంగును కలిగి ఉంటుంది. కానీ, ఈ వింత దృశ్యం ఏమిటో చెప్పటం మాత్రం

సముద్ర తీరంలో వింతజీవి హల్‌చల్‌.. ఏలియన్‌ అంటున్న స్థానికులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు..
Special Sea Worm
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 23, 2022 | 8:10 PM

ప్రకృతి గురించి మనకున్న సమాచారం చాలా పరిమితమనే చెప్పాలి. ప్రకృతితో ప్రయాణంలో మనం ఊహించని విధంగా మన కంటికి తగిలిన అందమైన సీతాకోకచిలుక కూడా మన జ్ఞానం పరిమితులను గుర్తు చేస్తుంది. మనం నేర్చుకోవాలనే ఆసక్తితో ముందుకు సాగితే ప్రకృతి ప్రతిరోజూ మరింత కొత్త సమాచారంతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది మొక్కలు కావచ్చు, జీవులు కావచ్చు. ఎన్ని రకాల మొక్కలు, మనకు తెలియని జీవులు మనలాగే ప్రకృతితో మైమేకమై జీవిస్తున్నాయో చెప్పలేం. అలాంటిదే ఇక్కడో అరుదైన జీవి సముద్రం ఒడ్డున కనిపించింది. అది మీ దృష్టికి చాలా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. అది మీకు మొదటి చూపులో అర్థం చేసుకోలేని రూపం. దాని ఒంటి నిండా ముళ్ళు, వెంట్రుకలు. ఇది మధ్యలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ, బంగారు రంగును కలిగి ఉంటుంది. కానీ, ఈ వింత దృశ్యం ఏమిటో చెప్పటం మాత్రం ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ చిత్రం ఏంటో మీరు చూడండి…

ఎడిన్‌బర్గ్‌లోని పోర్టోబెల్లో బీచ్‌లో మైక్ ఆర్నాట్ అనే యువకుడు నడుచుకుంటూ వెళుతుండగా దీన్ని కనుగొన్నాడు. మొదట మైక్ నాచు, మట్టితో కప్పబడిన పైన్ కోన్ అని భావించాడు. కానీ, దగ్గరికి వచ్చేసరికి అది సజీవంగా ఉందని, అది జీవి అని గ్రహించాడు. ఎంత గమనించినా ఈ జీవి ఏమిటో అతనికి అర్థం కాలేదట. ఒకానొక సమయంలో తాను ఏలియన్ అనుకుని ఆశ్చర్యపోయానంటూ మైక్ చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ, అతను దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వింత జీవం ఏమిటో స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

ఇది సముద్రంలో కనిపించే ప్రత్యేక రకం పురుగు. దీనిని స్కాటిష్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న పీట్ హాస్కెల్ కనుగొని స్పష్టం చేశారు. యూకే ఒడ్డున కూడా ఇలాంటివి చూడొచ్చని అంటున్నారు. అయితే నీటిలో ఎక్కువగా కనిపించే ఈ పురుగు నీళ్ల నుంచి బయటకు రాగానే చూసేవారిలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ మైక్ షేర్ చేసిన ఫోటో చాలా మందిని ఆకర్షించింది. చాలా మంది నెటిజన్లు ఫోటోని షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి