ప్రతిరోజూ వెల్లుల్లి నీటిని తాగితే.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ దూరం..!! ఎలా తయారు చేసుకోవాలంటే..

ఇలా చేసినా కూడా రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. వెల్లుల్లి లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్ రాకుండా అడ్డుకుంటుంది.

ప్రతిరోజూ వెల్లుల్లి నీటిని తాగితే.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ దూరం..!! ఎలా తయారు చేసుకోవాలంటే..
Garlic Water
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:27 PM

మన వంటగదిలోని కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా శరీరంలోని వివిధ వ్యాధులను నయం చేయవచ్చు. ఆ మేరకు వంటగదిలోని ప్రతి వస్తువుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జీలకర్ర, సోంపు, మెంతులు, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇలా ప్రతీదీ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ వెల్లుల్లిపాయ నీళ్లు తాగితే మంచి మెరుగుదల కనిపిస్తుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ క్రాంప్స్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పూర్తిగా నయమవుతాయి. సాధారణంగా బహిష్టు సమయంలో స్త్రీలకు కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఉదయాన్నే వెల్లుల్లిపాయలు తాగాలి. ఇది రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఇలా ఏయే వ్యాధులకు వంటింటిలో ఉండే వెల్లుల్లిని ఔషదంగా ఉపయోగిస్తారు..? ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం…

వెల్లుల్లి వంటలో ఎక్కువగా ఉపయోగించే పదార్ధం. వివిధ వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి, బి 6 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిని ఉడికించి, పచ్చిగా తినడం కంటే నీటిలో కలిపి తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఇలా తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు నయమవుతాయి.

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఈ నీటిలో తొక్క తీసిన మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఉదయం పరగడుపున తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటితో పాటు శరీరంలో లో పేరుకుపోయిన విశ్వ వ్యర్థాలను బయటకు నెట్టి వేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

లేదంటే రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ నీటిలో మూడు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. రాత్రంతా ఈ నీటిని నాననివ్వాలి. ఉదయం లేచాక పరగడుపున ఈ నీటిని తాగాలి ఇలా తాగి వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగేయలి. ఇలా చేసినా కూడా రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. వెల్లుల్లి లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్ రాకుండా అడ్డుకుంటుంది. శరీరం లోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా రక్షిస్తుంది. అయితే గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నవారు పరగడుపున నీటిని తాగకూడదు. ఉదయం అల్పాహారం చేసిన అరగంట తరువాత మాత్రమే వీరు ఈ నీటిని తాగాలని గుర్తుంచుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్