అంగ్లాంగ్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. దాదాపు 200కు పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధం.. కోట్లల్లో ఆస్తినష్టం..

ఈ జిల్లాలో ఇలాంటి అగ్నిప్రమాదాలు తరచూ జరగడం సర్వసాధారణమైపోయాయంటున్నారు స్థానికులు. మంటలకు పలు బైకులు, కార్లు ఆహుతయ్యాయి. ఇళ్లలోని నగదు, ఆహారవస్తువులు, దుస్తులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి.

అంగ్లాంగ్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. దాదాపు 200కు పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధం.. కోట్లల్లో ఆస్తినష్టం..
Assam Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 23, 2022 | 7:19 PM

అస్సాం-నాగాలాండ్ సరిహద్దులోని అసోం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంగ్లాంగ్‌ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఇళ్లు, దుకాణాలు, సమీపంలోని భవనాలను కూడా చుట్టుముట్టాయి. ఈ ఘటనలో దాదాపుగా 200లకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. దిమాపూర్‌, బోకజాన్‌ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.

ప్రమాదంలో 200 కు పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని పలు గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉధృతంగా వ్యాపించాయి.. మంటలకు పలు బైకులు, కార్లు ఆహుతయ్యాయి. ఇళ్లలోని నగదు, ఆహారవస్తువులు, దుస్తులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని అధికారులంటున్నారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ జిల్లాలో ఇలాంటి అగ్నిప్రమాదాలు తరచూ జరగడం సర్వసాధారణమైపోయాయంటున్నారు స్థానికులు. ఈ ఏడాది జూన్‌ నెలలో జెంగ్ఖా బజార్ ప్రాంతంలో‌, అక్టోబర్‌ నెలలో గోలాఘాట్‌ ప్రాంతంలో కూడా భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి