దేశానికి అన్నం పెట్టే మాకు.. పిల్లనివ్వడం లేదు సారూ.. తహసీల్దార్‌ని ఆశ్రయించిన యువకులు..

ఇతర ఉద్యోగాలుంటేనే ఆడపిల్లను ఇస్తారు. ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

దేశానికి అన్నం పెట్టే మాకు.. పిల్లనివ్వడం లేదు సారూ.. తహసీల్దార్‌ని ఆశ్రయించిన యువకులు..
Marriage Issue
Follow us

|

Updated on: Nov 23, 2022 | 8:57 PM

రైతన్న దేశానికి వెన్నెముకగా ఉన్న మనదేశంలో యువరైతులకు పెద్ద కష్టమే వచ్చిపడింది. యువ రైతులకు పెళ్లిళ్లు కావడం ఇప్పుడు గగనంగా మారింది. వారికి పిల్లనిచ్చేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో వారికి పెళ్లి పెద్ద సమస్యగా మారింది. తమకేవరు ఆడిపిల్లలను ఇవ్వడం లేదంటూ యువ రైతులంతా రోడ్డేక్కారు. తహసీల్దార్‌ను ఆశ్రయించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన హుబ్లీలోని కుందగోళ తాలూకాలో చోటు చేసుకుంది. కుందగోళకు చెందిన బాధిత యువ రైతులు తమకు పెళ్లి కావటం లేదని ఆవేదనతో నేరుగా తహసీల్దార్ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పెళ్లి కాని యువకులంతా రైతులు కావడంతో వారికి ఆడపిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదని బాధిత యువకులు మనస్తాపానికి గురయ్యారు. తమ ఆవేదనను చెప్పుకునేందుకు యువరైతుల బృందం కుందగొలను తహసీల్దార్‌ వద్దకు వెళ్లి విచారం వ్యక్తం చేసింది. హోసల్లి గ్రామంలో తహసీల్దార్ అశోక్ శిగ్గంవి ఆధ్వర్యంలో గ్రామ బస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతుకూలీల బృందం తమకు పెళ్లికి ఆడపిల్ల దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తహశీల్దార్‌కు లేఖ ఇచ్చిన యువత.. రైతు కుటుంబానికి చెందిన పిల్లలమని, వ్యవసాయంపైనే ఆధారపడి ఎదుగుతున్నామని చెప్పుకున్నారు. రైతులను దేశానికి వెన్నెముక అంటారు కాబట్టి.. రక్షణ కోసం సైనికుడు కావాలి. దేశానికి ఆహారం అందించే రైతు కావాలి. అలాగే రైతుల పిల్లలం కూడా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈరోజుల్లో రైతుల పిల్లలకు కన్యలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇతర ఉద్యోగాలుంటేనే ఆడపిల్లను ఇస్తారు. ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

దేశానికి అన్నం పెట్టాలంటే రైతులు అవసరమే కానీ.. కన్నబిడ్డలను ఇవ్వడానికి వెనుకాడుతున్నారని, రైతుల పిల్లలు రైతులు కాకూడదా.. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రైతులకు కన్నుల పండువగా ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కుందగొళ తహసీల్దార్ అశోక్ షిగ్గంవికి వినతి పత్రం సమర్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి