Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: ‘ఆ విషయంపై వాళ్లు ఎందుకు మాట్లాడడంలేదు’.. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌పై అనురాగ్ విమర్శలు..

Minister Anurag Thakur: అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగింపు సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ గురించి చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘అసభ్య పదాలు ఉపయోగించడం, అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. వారి అహంకారమే తమను ‘ఘమండీయా’ కూటమిలో సభ్యులుగా చేశాయ’ని ఠాకూర్ అన్నారు. ఇంకా ‘మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైంద’ని గురువారం లోక్‌సభలో గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఠాకూర్ ‘తుక్డే-తుక్డే ముఠా మద్దతు..

Anurag Thakur: ‘ఆ విషయంపై వాళ్లు ఎందుకు మాట్లాడడంలేదు’..  రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌పై అనురాగ్ విమర్శలు..
Anurag Thakur
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Aug 11, 2023 | 8:48 PM

Anurag Thakur: రాహుల్ గాంధీ రంగప్రవేశం మరోసారి నిరాశపరిచిందంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగింపు సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ గురించి చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘అసభ్య పదాలు ఉపయోగించడం, అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. వారి అహంకారమే వారిని ‘ఘమండియా’ కూటమిలో సభ్యులుగా చేశాయ’ని ఠాకూర్ అన్నారు. ఇంకా ‘మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైంద’ని గురువారం లోక్‌సభలో గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఠాకూర్ ‘తుక్డే-తుక్డే ముఠా మద్దతు దారులు మాత్రమే మన భారత మాతను చంపాలని ఆలోచించగలరు. వారు మణిపూర్ గురించి ఆందోళన చెందలేదు కానీ మీడియాలో వారి ఇమేజ్ గురించి ఆందోళన చెందుతున్నార’ని ఠాకూర్ అన్నారు.

మణిపూర్ విషయంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వారి పాలన సమయంలోనే అస్సాం, మిజోరం విషయంలో జరిగిన దారుణాల గురించి ఎందుకు మాట్లాడడంలేదని, వారి విధానాల వల్లనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ‘బాంబ్, బంధ్, బ్లాస్ట్’ పరిస్థితి ఏర్పడిందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావించకుండా రాహుల్ మళ్లీ విఫలమయ్యారని ఠాకూర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా ప్రసంగం..

వారికి ఆ ఆలోచన లేదు..!

వారి పాలనలో ‘బాంబ్, బంధ్, బ్లాస్ట్’

అయితే గురువారం అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ప్రసంగంలో భాగంగా మాట్లాడిన కొన్ని పదాలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే గాంధీ ‘భారత్ మాత’ అనే పదం కూడా ఈ రోజుల్లో ‘అన్ పార్లమెంటరీ పదం’గా మారిందంటూ ఆరోపించారు. లోక్‌సభ ప్రసంగం తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ‘అక్కడ(మణిపూర్) మహిళలు, పిల్లలు చనిపోతున్నారు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. భారత ప్రధాని పార్లమెంటు మధ్యలో కూర్చుని నవ్వుతున్నారు. ఇది రాహుల్ గాంధీ గురించి కాదు, కాంగ్రెస్ గురించి కాదు, ప్రతిపక్షం గురించి కాదు.  ఇది భారతదేశం గురించి, ఇది మన దేశం గురించి. ఒక రాష్ట్రం నాశనం అయింది, అది ఇప్పుడు ఉనికిలో లేదు. ఇది బీజేపీ రాజకీయాల వల్ల జరిగింద’ని ఆరోపించారు.