Trending Video: పిచ్చెక్కించేశావ్ కదరా..! తమన్నా పాటకు బుడ్డోడి డ్యాన్స్.. మళ్లీమళ్లీ చూడాలనిపించే వీడియో..

Trending Video: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట కోసం తమన్నా భాటియా వేసిన స్టెప్పులు  కుర్రకారును నిద్రపోనివ్వట్లేదు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ పాటను చూసి పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ మళ్లీ ఈ పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే పాటకు డ్యాన్స్ వేసిన తమన్నా భాటియా అయినా పడిపడి నవ్వుకోవాల్సిందే. అలాంటి వీడియో మరి అది. ఇంతకీ

Trending Video: పిచ్చెక్కించేశావ్ కదరా..! తమన్నా పాటకు బుడ్డోడి డ్యాన్స్.. మళ్లీమళ్లీ చూడాలనిపించే వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 09, 2023 | 1:41 PM

Trending Video: గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాను ఓ పాట ఊపేస్తుంది. ఎక్కడ చూసినా ఆ పాటకు సంబంధించిన రీల్సే కనిపిస్తున్నాయి. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట. ఈ పాట కోసం తమన్నా భాటియా వేసిన స్టెప్పులు  కుర్రకారును నిద్రపోనివ్వట్లేదు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ పాటను చూసి పిచ్చెక్కి పోతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ మళ్లీ ఈ పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే పాటకు డ్యాన్స్ వేసిన తమన్నా భాటియా అయినా పడిపడి నవ్వుకోవాల్సిందే. అలాంటి వీడియో మరి అది. ఇంతకీ ఆ వీడియోలో ఎవరు, ఎలా డ్యాన్స్ వేశారంటే..

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఓ స్కూల్ ప్లే గ్రౌండ్‌లో చిత్రీకరించినది. ఆ వీడియోలో కొంతమంది విద్యార్థులు ‘నువ్వు కావాలయ్యా’ అంటూ మూకుమ్మడిగా కాలు కదిపారు. వారు వేసిన స్టెప్పులు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నా నవ్వకుండా మాత్రం ఉండలేరు. ముఖ్యంగా ఈ వీడియోలో లావుగా కనిపిస్తున్న బాలుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతను వేసిన డ్యాన్స్ స్టెప్పుల కోసం అయినా మళ్లీ చూడాలనిపించేలా ఉంది ఈ వీడియో. ఇక అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని అంతా చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశాడు. @balramrj143 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోలో మీరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by balram (@balramrj143)

5 రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 6 లక్షల 7 వేలకు పైగా వీక్షణలు, దాదాపు 75 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేసే వీలు లేకుండా హ్యాండిల్ యూజర్ కామెంట్లను డిజేబుల్ చేశారు.