World Cup 2023: వరల్డ్‌కప్ ఆడనున్న ఆస్ట్రేలియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌పై వేటు.. ‘భారత్’ ఆటగాడికి ఆరంగేట్ర అవకాశం..!
Australia Cricket team: అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లోనే కాక సౌతాఫ్రికా, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ల్లో కూడా ఇదే జట్టు ఆడనుంది. సెప్టెంబర్ 7 నుంచి అదే నెల 27వ తేదీ మధ్యలో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా, భారత్‌తో వన్డే సిరీస్‌లను ఆడుతుంది. క్రికెట్ కార్నివల్‌గా చెప్పుకునే ప్రపంచకప్ టోర్నీలో, అలాగే అంతక ముందుగానే జరిగే వన్డే సిరీస్‌ల్లో కంగారుల జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ 18 మంది సభ్యుల లిస్టులో మార్నస్ లబుషేన్ పేరు లేకపోవడం..
World Cup 2023: భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా రెండు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. ఈ మేరకు 18 మంది ప్లేయర్లతో కూడిన ఆసీస్ జట్టును ట్వీట్ చేసింది. ఇక అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లోనే కాక సౌతాఫ్రికా, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ల్లో కూడా ఇదే జట్టు ఆడనుంది. సెప్టెంబర్ 7 నుంచి అదే నెల 27వ తేదీ మధ్యలో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా, భారత్‌తో వన్డే సిరీస్‌లను ఆడుతుంది. క్రికెట్ కార్నివల్‌గా చెప్పుకునే ప్రపంచకప్ టోర్నీలో, అలాగే అంతక ముందుగానే జరిగే వన్డే సిరీస్‌ల్లో కంగారుల జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ 18 మంది సభ్యుల లిస్టులో మార్నస్ లబుషేన్ పేరు లేకపోవడం ఆశ్చర్యకరం.
అయితే ఈ జట్టులో ఓ ఇద్దరు ప్లేయర్లను తొలిసారిగా ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. వారిలో ఒకరు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ, మరొకరు భారత సంతతికి చెందిన స్పిన్నర్ తన్వీర్ సంగా. ఇటీవలి కాలంలో హార్డీ, తన్వీర్ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తుండడంతో వ్యూహాత్మకంగా వీరిద్దరినీ ఎంపిక చేసింది అసీస్ క్రికెట్ బోర్డ్. పంజాబ్‌లోని జలంధర్‌కి చెందిన తన్వీర్ తండ్రి జోగా సంగా 1997లో ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే తన్వీర్ సంగా జన్మించాడు. ఇక ఈ లిస్టులో ప్యాట్ కమ్మిన్స్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంగాతో పాటు సీన్ అబాట్, ఆష్టన్ ఆగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లీస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్స్, మార్నస్ స్టోయినీస్, ఆడమ్ జంపా వంటి పలువురు ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. ఇంకా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్.. ధీటైన బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు. ప్రపంచకప్‌లో ఆడనున్న 10 జట్లు కూడా సెప్టెంబర్ 5వ తేదీలోపు తమ ప్లేయర్ల జాబితాను ఐసీసీకి సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుగానే ప్రకటించింది.
Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023
కాగా, వన్డే ప్రపంచకప్ టోర్నీ కంటే ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొత్తం 8 వన్డేలు ఆడనుంది. వీటిల్లో దక్షిణాఫ్రికా 5 , భారత్‌తో 3 వన్డేలను ఆడనుంది. ఇక సెప్టెంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీకి 15 మంది సభ్యుల లిస్టునే సమర్పించాల్సి ఉండగా.. ఈ లోపు ఆటగాళ్ల ఆటతీరును బట్టి ఈ జట్టులో నుంచే ఆసీస్ ఎంపిక చేయనుంది. ఇక వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుండగా.. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచులో భారత్‌తోనే అక్టోబర్ 8న తలపడనుంది.
సౌతాఫ్రికా, భారత్ వన్డే సిరీస్.. ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లీస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, మిచెల్ మార్ష్, గ్రెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంగా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.