లూనార్ ఆర్బిట్‌లో భారత్, రష్యా పోటీ.. ఒక రోజు తేడాతో 2 మిషన్ల ల్యాండింగ్.. ఆసక్తికరంగా చంద్రయాన్..

Chandrayan 3 vs Luna 25: ఒంటరిగా వెళ్లి విజయం సాధిస్తే ఏం మజా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే కదా రేస్‌కి కిక్ వచ్చేది. విజయానికి అసలైన గుర్తింపు వచ్చేది. ఇప్పుడు చంద్రయాన్ 3 విషయంలోనూ అదే జరగబోతోంది. భూమి మీద మిత్ర పక్షమే అయినప్పటికీ అంతరిక్షంలో మాత్రం సై అంటోంది రష్యా. మనకన్నా ముందే చంద్రుడిపై ల్యాండ్ చేసేందుకు లూనా ప్రయోగాన్ని చేపట్టింది రష్యా...

లూనార్ ఆర్బిట్‌లో భారత్, రష్యా పోటీ.. ఒక రోజు తేడాతో 2 మిషన్ల ల్యాండింగ్.. ఆసక్తికరంగా చంద్రయాన్..
Chandrayaan 3 Vs Luna 25
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Narender Vaitla

Updated on: Aug 12, 2023 | 8:44 AM

Chandrayan 3 vs Luna 25: చంద్రుడిపైన ఇంతవరకు ఎవరూ చేరుకోని దక్షిణ ధృవంపైకి మనం చంద్రయాన్ ప్రయోగం చేపడితే.. అదే చందమామపైకి.. ప్రత్యేకించి మనం గురిపెట్టిన దక్షిణ ధృవంపైకి రాకెట్‌ను ఎక్కుపెట్టింది రష్యన్ స్పేష్ ఏజెన్సీ. దాని పేరే లూనా 25. ఇవాళ తెలవారుజామున 2 గంటల 10 నిముషాలకు నింగిలోకి ఎగిరిందీ రాకెట్.దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు.. ‘లునా-25’ ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది. ఈ మిషన్ల విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం.

చంద్రయాన్ 3 ప్రయోగానికి మొత్తం 40 రోజులకుపైగా సమయం పడితే.. రష్యా పంపిన లూనా కేవలం 12 రోజుల్లోనే ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకంటే తక్కువ టైమ్‌లోనే వాళ్లు చేరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖర్చును కూడా గమనించాలి. లూనాకు అయిన ఖర్చు రష్యా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చంద్రయాన్‌తో పోలిస్తే.. మూడు రెట్లు ఖర్చు ఎక్కువ వాళ్లకి. సో.. మనకున్న తక్కువ బడ్జెట్‌, టెక్నాలజీలోనే మన సైంటిస్టులు అద్భుతాలు సృష్టిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.

ఇవి కూడా చదవండి

రెండు ఇంజిన్లు ఫెయిల్ అయినా.. సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్. దీంతో ఈసారి చంద్రుడిపై అడుగుపెట్టి. జాబిలి రహస్యాలు ఛేదిస్తామని ధీమాగా ఉంది ఇస్రో. ఇప్పటికే చంద్రుడి చుట్టు చంద్రయాన్ 3 తిరుగుతోంది. మరోవైపు రష్యా చేపట్టిన లూనా 25 కూడా 5 నుంచి 7 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఉంటుంది. మరి ఈ రెండూ ఏమైనా ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఈ రెండింటి ల్యాండింగ్ ప్రదేశాలు వేరు. లక్ష్యాలు కూడా వేరు.

చంద్రయాన్ 3 అనేది జాబిలిపై ఉన్న నీటి జాడలు, ఉపరితలాన్ని పరిశీలించేందుకు వెళ్తోంది. లూనా 25 మాత్రం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు కొన్ని సైంటిఫిక్ మెటీరియల్స్ ఇందులో ఉన్నాయి. ఈ లూనా-25 ప్రయోగంపై రష్యాకు అభినందనలు తెలిపింది ఇస్రో. ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్‌ పాయింట్‌ ఉండటం అద్భుతం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. చంద్రయాన్‌-3, లూనా-25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది. ఎందుకంటే.. రష్యా మనకి మిత్ర దేశం. ఆయుధాల సప్లై దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై పరస్పరం మద్ధతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి రెండు దేశాలు. అంతేకాకుండా స్పోర్టివ్‌నెస్‌గా తీసుకున్న ఇస్రో అభినందలు తెలిపింది.

మరోవైపు వరుస ప్రయోగాలతో లూనార్ ఆర్బిట్‌లో క్రౌడ్ కనిపిస్తోంది. ఎక్కువ వెహికల్స్ వస్తే రోడ్డు రద్దీగా మారినట్టే.. వరుస ప్రయోగాలతో లూనార్ ఆర్బిట్‌లో కూడా రద్దీగా మారింది. ఆర్బిట్‌లో ప్రస్తుతం 6 యాక్టివ్‌గా ఉన్నాయి. వాటిలో నాసా ప్రయోగాలకు సంబంధించినవి నాలుగు అయితే.. ఇండియాకు సంబంధించిన చంద్రయాన్ 2 కూడా ఇప్పటికే ఆర్బిట్‌లో ఉంది. ఇక కొరియాకు చెందిన ఓ ఆర్బిటార్ కూడా ఉంది.

ఇదిలా ఉంటే రష్యా అంతరిక్ష నౌక ఆగష్టు 16 నాటికి 100 కిలోమీటర్ల చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం ఆగస్టు 21-23 నాటికి చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ కానుంది. రష్యా ఈ ప్రయోగాన్ని ఇది వరకే చాలా సార్లు చేసింది అయితే ఇండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే రష్యా తన మూన్ మిషన్ కోసం శక్తివంతమైన సోయుజ్ 2.1ని ఉపయోగిస్తోంది. దీంతో కేవలం ఆరు నుంచి ఏడు రోజుల్లోనే చంద్రుడిని చేరుకుంటుంది. ఈ రాకెట్ లాంచ్ అయిన తర్వాత భూ కక్ష్యలో వేచి ఉండకుండా నేరుగా చంద్రుడిని చేరుకోగలదు. దీనికి కారణం అంతరిక్ష నౌకకు అవసరమైన థ్రస్ట్ ఇవ్వగలగడమే. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..