AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Cards: ఒకే ఆధార్‌ లింక్‌తో 658 సిమ్‌ కార్డ్‌లు.. కట్‌ చేస్తే షాకిచ్చిన పోలీసులు

సిమ్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారని ఔట్‌లెట్ తెలిపింది. అయితే నేరగాళ్లు ఇలా మీకు తెలియకుండా కూడా మీ ఆధార్‌పై సిమ్‌ కార్డ్‌లు తీసుకునే అవకాశం ఉంది. వారు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ వద్ద లేని సిమ్‌ కార్డులు మీ ఆధార్‌పై ఉన్నట్లయితే వెంటనే బ్లాక్‌ చేసుకోవడం ఉత్తమం. లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

SIM Cards: ఒకే ఆధార్‌ లింక్‌తో 658 సిమ్‌ కార్డ్‌లు.. కట్‌ చేస్తే షాకిచ్చిన పోలీసులు
Sim Cards
Subhash Goud
|

Updated on: Aug 11, 2023 | 7:41 PM

Share

డిజిటల్ లావాదేవీలు, సమాచారాన్ని పంచుకోవడం ఆనవాయితీగా మారిన ఈ యుగంలో మోసాలు కూడా చాలా రెట్లు పెరిగాయి. సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడే విధంగా కొత్త కొత్త మార్గాలనే అన్వేషిస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు నిపుణులను కూడా వారు కష్టపడి సంపాదించిన డబ్బును లాక్కుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు 658 సిమ్ కార్డులను ఒకే ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారని ఔట్‌లెట్ తెలిపింది. అయితే నేరగాళ్లు ఇలా మీకు తెలియకుండా కూడా మీ ఆధార్‌పై సిమ్‌ కార్డ్‌లు తీసుకునే అవకాశం ఉంది. వారు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ వద్ద లేని సిమ్‌ కార్డులు మీ ఆధార్‌పై ఉన్నట్లయితే వెంటనే బ్లాక్‌ చేసుకోవడం ఉత్తమం. లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పోలుకొండ నవీన్‌ పేరుతో సిమ్‌కార్డులు రిజిష్టర్‌ అయినట్లు గుర్తించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై తొమ్మిది సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఒక ఆధార్ నంబర్ ఇచ్చి ఎక్కువ కనెక్షన్లు తీసుకునే పెద్ద కుటుంబాలకు ఈ సౌకర్యం కల్పించారు. అయితే, ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయో తనిఖీ చేయడానికి DoT వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం వెబ్‌సైట్‌ కి లాగిన్ చేయడం ద్వారా వినియోగదారు తన పేరుతో జారీ చేసిన సిమ్‌ కార్డ్‌ల సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్‌ను బ్లాక్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మీ ఆధార్‌లో ఎన్ని SIM కార్డ్‌లు జారీ జారీ అయ్యాయో తెలుసుకోవడం ఎలా?

  • ఈ వెబ్‌సైట్‌ లాగిన్‌ అయిన తర్వాత వినియోగదారునికి రెండు లింక్‌లు కనిపిస్తాయి.
  • మీ పోగొట్టుకున్న/దొంగిలించిన మొబైల్‌ని బ్లాక్ చేయండి.. అలాగే మీ మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోండి అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • రెండవ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుని 10-అంకెల మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్‌కు స్వీకరించే OTPని నమోదు చేయమని అడుగుతూ ఓ పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ఓపెన్‌ అయిన పేజీలో వినియోగదారు పేరుతో నమోదు చేయబడిన మొబైల్ నంబర్ల వివరాలు ఉంటాయి.
  • అందులో ఏదైనా నంబర్‌ను బ్లాక్ చేసే ఆప్షన్‌ కూడా కనిపిస్తాయి.
  • DoT ప్రకారం.. సంచార్ సాథీ పోర్టల్ మొబైల్ వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు, అలాగే అవగాహనను పెంచడానికి ఉద్దేశించబడిందని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!