Onion Price: కోయకుండానే కన్నీళ్లు.. వినియోగదారులకు షాకివ్వనున్న ఉల్లి రేటు.. అప్పటి వరకు రెట్టింపు ధర

ఉల్లి ధరలు తగ్గడంతో రైతులు ఈసారి ఉల్లిని తక్కువగా సాగు చేశారు. అదే సమయంలో వర్షం, వరద ప్రభావం ఉల్లిపైనా పడడం ప్రారంభించింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఉల్లి సరఫరా క్రమంగా తగ్గుతోంది. స్టాక్‌లో ఉంచిన ఉల్లి వచ్చే నెల నుంచి బయటకు రావడం ప్రారంభమవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగడానికి ఇదే కారణం. ఏదీ ఏమైనా టమోటా తర్వాత ఇప్పుడు ఉల్లి వంతు రానుంది. వచ్చే నెల నాటికి ధరలు రెట్టింపు అయ్యే అవకాశం..

Onion Price: కోయకుండానే కన్నీళ్లు.. వినియోగదారులకు షాకివ్వనున్న ఉల్లి రేటు.. అప్పటి వరకు రెట్టింపు ధర
Onion Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2023 | 6:25 PM

దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో పేదోడి బతుకు దారుణంగా మారిపోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టమాట ధరలు మండిపోవడంతో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కన్నీళ్లు పెట్టించే రోజులు అతి త్వరలో రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట ధరలు రూ.200 దాటాయి. ఇదే సమయంలో ఉల్లి ధర కూడా పెరుగుతుందని మార్కెట్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నాటికి ఉల్లి ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. రానున్న నెలల్లో ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.28 నుంచి రూ.32 వరకు విక్రయిస్తున్నారు. వచ్చే నెల వరకు కిలోకు 70-80 రూపాయలు ఉండవచ్చు.

ధరలు ఎంత పెంచవచ్చు?

ఆగస్టు చివరి నెలలో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉంది. అయితే సరఫరా తగ్గడం వల్ల ఈ పెరుగుదల ఉండవచ్చు. ఈ సమయంలో ఉల్లి ధర కిలో రూ.60-70 వరకు పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ నివేదిక పేర్కొంటోంది.

ఉల్లి ధర ఎంతకాలం ఉంటుంది?

రబీ ఉల్లిపాయలు ఈ సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో విక్రయం కారణంగా బహిరంగ మార్కెట్‌లో రబీ స్టాక్ సెప్టెంబర్‌కు బదులుగా ఆగస్టు నెల నుంచి తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో ఉల్లి నిల్వలు పెరుగుతాయి. సాధారణ ప్రజలు 15-20 రోజుల పాటు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దీని వల్ల ధర పెంపు

ఉల్లి ధరలు తగ్గడంతో రైతులు ఈసారి ఉల్లిని తక్కువగా సాగు చేశారు. అదే సమయంలో వర్షం, వరద ప్రభావం ఉల్లిపైనా పడడం ప్రారంభించింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఉల్లి సరఫరా క్రమంగా తగ్గుతోంది. స్టాక్‌లో ఉంచిన ఉల్లి వచ్చే నెల నుంచి బయటకు రావడం ప్రారంభమవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగడానికి ఇదే కారణం. ఏదీ ఏమైనా టమోటా తర్వాత ఇప్పుడు ఉల్లి వంతు రానుంది. వచ్చే నెల నాటికి ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి సరఫరా బాగానే ఉన్నా ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి సాగు ఎక్కువగా ఉండే ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ ఎత్తున నష్టపోయారు రైలులు. ఇప్పటికే టమాట ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు ఖర్చుల విషయంలో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ధర కొంత మెరుగ్గా ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా తక్కువ ధర ఉన్నప్పుడే ఇంట్లో నిల్వ ఉంచుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి