BCCI: దటీజ్ బీసీసీఐ..! వేల కోట్ల ఆదాయంతో ప్రపంచంలోనే రిచ్ బోర్డ్‌‌.. ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తుందంటే..?

Board of Control for Cricket in India: గత ఐదేళ్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంత ఆదాయాన్ని సంపాదించింది, ప్రభుత్వానికి ఎంత మొత్తంలో పన్ను చెల్లించిందనే వివరాలు అర్థిక శాఖ విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ. 1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇది..

BCCI: దటీజ్ బీసీసీఐ..! వేల కోట్ల ఆదాయంతో ప్రపంచంలోనే రిచ్ బోర్డ్‌‌.. ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తుందంటే..?
BCCI Secretary Jay Shah and Board's prez Rogers Binny
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 09, 2023 | 1:34 PM

BCCI: ప్రపంచ క్రికెట్ దేశాల్లోకెల్లా మన దేశానికి చెందిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌ (బీసీసీఐ) అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అని అందరికీ తెలుసు. అయితే బీసీసీఐ ఆదాయ, ఖర్చుల వివరాలు ఎలా ఉన్నాయనే వివరాలు చాలా మందికి తెలియదు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ నివేదిక ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌ ఆదాయం గురించి ఒకింత అయినా అవగాహన కలుగుతోంది. గత ఐదేళ్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంత ఆదాయాన్ని సంపాదించింది, ప్రభుత్వానికి ఎంత మొత్తంలో పన్ను చెల్లించిందనే వివరాలు అర్థిక శాఖ విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ. 1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇది అత్యధికం, అలాగే 2020-21 అర్ధిక సంవత్సరం చెల్లించిన పన్నుల కంటే 37 శాతం ఎక్కువ.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వేదికగా బీసీసీఐ చెల్లించిన పన్నుల వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 844.92 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించగా.. 2019-20లో రూ 882.29 కోట్లు చెల్లించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఆ తర్వాతి సంవత్సరంలో పన్నుల మొత్తం తగ్గింది. కరోనా కారణంగా క్రికెట్ కొనసాగని నేపథ్యంలో ఇలా జరిగిందని లెక్కలు వివరిస్తున్నాయి. అలాగే 2018-19లో బీసీసీఐ రూ.815.04 కోట్ల పన్ను.., 2017-18లో 596.63 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను చెల్లించింది.

ఇవి కూడా చదవండి

గత ఐదేళ్లలో BCCI ఆదాయం- వ్యయం వివరాలు:

గత ఐదేళ్లతో పోలిస్తే 2021-22లో భారత క్రికెట్ బోర్డు అత్యధికంగా రూ.7,606 కోట్ల ఆదాయాన్నిసంపాదించింది. అలాగే ఈ సమయంలో బీసీసీఐ ఖర్చు దాదాపు 3,064 కోట్ల రూపాయలుగా ఉంది..

  1. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం ఆదాయం– రూ. 7606.15 కోట్లు.. వ్యయం– రూ. 3063.88 కోట్లు
  2. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం ఆదాయం– Tk 4735.14 కోట్లు, వ్యయం– రూ. 3080.37 కోట్లు
  3. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం ఆదాయం– 4972.43 కోట్లు, వ్యయం– రూ. 2268.76 కోట్లు
  4. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం ఆదాయం– 7181.61 కోట్లు, వ్యయం– రూ. 4652.35 కోట్లు
  5. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో  మొత్తం ఆదాయం– 2916.67 కోట్లు, వ్యయం– రూ. 2105.50 కోట్లు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..