AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Kumar Yadav: మరో రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఏ విషయంలో తెలుసా?

ఈ మ్యాచ్‌తో సూర్య కుమార్ అనేక రికార్డులని తిరగరాసాడు అని చెప్పొచ్చు. 100 సిక్సులు కంప్లీట్ చేసిన ఆటగాడిగా.. అది కూడా అత్యంత వేగంగా 100 సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య కుమార్ రికార్డ్ సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్ ఆల్రెడీ విండీస్ ఎవిన్ లుఈస్ పేరు మీద ఉంది. ఇప్పుడు సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. టి20 ఫార్మాట్ కి సంబంధించి సూర్య కుమార్ అనేక రికార్డ్స్ బదులు కొట్టాడు. గత నవంబర్ నెలలోనే అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఒకే సంవత్సరంలో..

Surya Kumar Yadav: మరో రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఏ విషయంలో తెలుసా?
Surya Kumar Yadav
Ashok Bheemanapalli
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 09, 2023 | 1:23 PM

Share

ఎట్టకేలకు సూర్య కుమార్ యాదవ్ మళ్లీ తన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన ఎస్‌కే.. వెస్టిండీస్‌తో గయానలో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో బ్యాండ్ బజాయించాడు. తన బ్యాట్‌కు పని చెప్పి.. వీర విహారం చేశాడు సూర్య కుమార్ యాదవ్. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని దాటేశాడు ఈ మిస్టర్ 360. మొత్తం మ్యాచ్‌లో 44 బంతులు ఆడిన సూర్య 10 ఫోర్లు, 4 నాలుగు సిక్సర్లతో 83 రన్స్ చేశాడు. సూర్య బ్యాటింగ్ దెబ్బకు టి20 లో ఏడు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌తో సూర్య కుమార్ అనేక రికార్డులని తిరగరాసాడు అని చెప్పొచ్చు. 100 సిక్సులు కంప్లీట్ చేసిన ఆటగాడిగా.. అది కూడా అత్యంత వేగంగా 100 సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా సూర్య కుమార్ రికార్డ్ సృష్టించాడు. ఈ అరుదైన ఫీట్ ఆల్రెడీ విండీస్ ఎవిన్ లుఈస్ పేరు మీద ఉంది. ఇప్పుడు సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. టి20 ఫార్మాట్ కి సంబంధించి సూర్య కుమార్ అనేక రికార్డ్స్ బదులు కొట్టాడు. గత నవంబర్ నెలలోనే అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఒకే సంవత్సరంలో 1000 రన్స్ చేసిన ఆటగాడిగా కూడా సూర్య కుమార్ రికార్డ్ సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ఇక క్రికెట్ దాటి మరొక విషయం మాట్లాడుకుంటే.. గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన వ్యక్తిగా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. సూర్య కుమార్ ఎక్కడ చదువుకున్నాడు, అతని తండ్రి ఎవరు? సంపాదన ఎంత? కార్ కలెక్షన్ ఏంటి? ఎన్ని కోట్లు వచ్చాయి? వంటి ఎస్‌కే వ్యక్తిగత వివరాలన్నింటినీ తెగ వెతికేస్తున్నారట నెటిజన్లు. ఇక వారి ప్రశ్నలకు సమాధానాలు చూసి కూడా నెటిజన్లు అవాక్కవుతున్నారట.

గూగుల్ వేదికగా నెటిజన్స్ వెతుకుతున్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం ఇక్కడ చూద్దాం..

1. సూర్య కుమార్ యాదవ్ ఆస్తి నికర విలువ రూ. 45 నుంచి 55 కోట్లు ఉంటుంది.

2. కార్ కలెక్షన్ విషయానికొస్తే బీఎండబ్ల్యూ 5 సిరీస్, 530 Dm sports, Audi A6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చునర్.

3. బైక్స్ విషయానికి వస్తే సుజుకి హైబుసా, హార్లే డేవిడ్సన్ ఇతర స్పోర్ట్స్ బైకులు కూడా ఉన్నాయి.

4. అంతేకాదండోయ్.. ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువ ధరకు సూర్య కుమార్ యాదవ్‌‌ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ టీమ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..