Natural Beauty Tips: ‘విటమిన్ ఇ’ క్యాప్సూల్స్ వేసుకునే బదులు వీటిని తినండి.. మీ చర్మం జిగేల్‌మంటుంది..

మనం ఏదైనా తిన్నప్పుడు, దానిలోని పోషకాలు శరీరానికి లోపలి నుండి పోషణను అందిస్తాయి. దీని వల్ల మనం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న వాటిని తినడం ద్వారా, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. దాంతోపాటుగానే చర్మం సహజంగా మెరుస్తుంది. ఈ నేపథ్యంలోనే డైట్‌లో ఏయే ఆహారాలు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

Natural Beauty Tips: ‘విటమిన్ ఇ’ క్యాప్సూల్స్ వేసుకునే బదులు వీటిని తినండి.. మీ చర్మం జిగేల్‌మంటుంది..
Beauty Tips
Follow us

|

Updated on: Aug 08, 2023 | 2:19 PM

విటమిన్ ఇ వంటి పోషకాలు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కంటి చూపును కూడా పెంచుతుంది. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచే, ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పరిగణించబడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రజలు మెరిసే చర్మం కోసం వివిధ మార్గాల్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయడం మనం చూస్తూనే ఉన్నాయి. అయితే, ఇలా విటమిన్స్ తీసుకోవడం వల్ల పైపై మెరుగులు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే అంతర్గతంగా విటమిన్ ఇ లోపం ఉండదు. పైగా చర్మం యవ్వనంగా మారుతుంది.

మనం ఏదైనా తిన్నప్పుడు, దానిలోని పోషకాలు శరీరానికి లోపలి నుండి పోషణను అందిస్తాయి. దీని వల్ల మనం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న వాటిని తినడం ద్వారా, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. దాంతోపాటుగానే చర్మం సహజంగా మెరుస్తుంది. ఈ నేపథ్యంలోనే డైట్‌లో ఏయే ఆహారాలు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

బాదం..

బాదంపప్పులో విటమిన్ ఇ మంచి పరిమాణంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ప్రభావం శరీర ఉష్ణోగ్రతను పెంచినప్పటికీ.. మితంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్..

బీట్‌రూట్ చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇతో సహా పోషకాలు చాలా ఉంటాయి. బీట్‌రూట్ ఆకులను ఆకుకూరల మాదిరిగా తినవచ్చు. ఇది మీ ముఖారవిందాన్ని పెంచుతుంది.

బచ్చలికూర..

పాలకూర, బచ్చలికూరలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో ఒకటి విటమిన్ ఇ. ఈ ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు..

ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకుంటే, శరీరంలో విటమిన్ E లోపాన్ని తీర్చవచ్చు. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 35.17 mg విటమిన్ E ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అవకాడో..

విటమిన్ ఇ కోసం ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం చాలా కీలకం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. దీని వల్ల చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు పడే సమస్యను తగ్గిస్తుంది. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. అవకాడోను చాలా ఫేషియల్ ప్రోడక్ట్స్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..