Rose Flower: బాబోయ్.. ఈ గులాబీ పువ్వు ధరతో జూబ్లీహిల్స్‌లో పెద్ద ప్యాలెస్ కట్టొచ్చు.. ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

దీనికి ఇంత ధరనా? అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగానే ఆ పువ్వుకు భారీ ధర ఉంది. మరి ఆ పువ్వు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజా పువ్వులు విరివిగా పూస్తాయి. కానీ, ఈ జూలియట్ రోజ్ మాత్రం చాలా స్పెషల్. ఇది పెరగడానికి సుమారు..

Rose Flower: బాబోయ్.. ఈ గులాబీ పువ్వు ధరతో జూబ్లీహిల్స్‌లో పెద్ద ప్యాలెస్ కట్టొచ్చు.. ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు..!
Juliet Rose
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 09, 2023 | 8:04 AM

ఈ విశాల భూ ప్రపంచంలో అరుదైన, ప్రత్యేకమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటి ప్రత్యేకత కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి ప్రత్యేకమైనది ఒకటి ఇప్పుడు బిగ్ టాపిక్‌గా మారింది. అవును, ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే.. ధనవంతులు సైతం కొనడానికి ఆలోచించే కాస్ట్లీ వస్తువులు కూడా ఉంటాయి. రోల్స్ రాయిస్, బుగాటీ, మెర్సిడెస్, లంబోర్గినీ వంటి కార్ల కంపెనీల గురించి వినే ఉంటారు. ఆ కార్ల ధర బిలియన్లలో ఉంటుంది. వీటిని కొనడానికి బిలియనీర్లు సైతం 10 సార్లు ఆలోచిస్తారు. అయితే, అవి కార్లు కాబట్టి అంత మొత్తం ఉంటుందని భావించొచ్చు. మరి ఒక పువ్వు ఆ కార్ల కంటే కూడా అధిక ధర ఉంటే? ఏకంగా అది 100 కోట్లకు పైగా ధర పలికితే? అవునండీ ఇది నిజంగా నిజం. ఓ గులాబీ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వుగా నిలిచింది.

ఈ గులాబీని పువ్వును జూలియట్ రోజు అని పిలుస్తారు. దీని ధర తెలిస్తే మీరు కోటీశ్వరులైనా.. కొనడానికి పలుమార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఆ పువ్వు కొనడానికి భారీగా వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి.

గులాబీ పువ్వు ధర ఎంతంటే..

ఒక్క జూలియట్ రోజ్ ధర రూ.130 కోట్లు. అయితే, దీనికి ఇంత ధరనా? అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగానే ఆ పువ్వుకు భారీ ధర ఉంది. మరి ఆ పువ్వు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజా పువ్వులు విరివిగా పూస్తాయి. కానీ, ఈ జూలియట్ రోజ్ మాత్రం చాలా స్పెషల్. ఇది పెరగడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ ఫ్లవర్ స్పెషాలిటీ. ఇక ఈ పువ్వు పూసే లోపు మొక్క కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. ఆ పువ్వు పూసే వరకు మొక్కను చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కారణాల చేత జూలియట్ రోజ్‌కు అంత డిమాండ్ ఉంది.

రూ. 37 కోట్లు ఖర్చు..

మీడియా నివేదికల ప్రకారం.. ఈ గులాబీని మొదటిసారిగా డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి ఒక ప్రయోగంగా పెంచాడు. ఇతను దానిని 2006 సంవత్సరంలో పెంచాడు. ఈ ప్రత్యేకమైన గులాబీని పెంచడానికి, అతను అనేక జాతుల గులాబీలను మిళితం చేసి, ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. దీన్ని పెంచేందుకు దాదాపు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే, ఈ పువ్వుకు జూలియట్ రోజ్ అని పేరు పెట్టాడు. ఇలా పెరిగిన జూలియన్ రోజ్ ఫ్లవర్‌ను డేవిడ్ ఆస్టిన్ రూ.90 కోట్లకు క్రయించినప్పటికీ, ఇప్పుడు దాని ధర రూ.130 కోట్లకు చేరుకుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!