Car Care Tips: మీ కారులో ఈ తేడా కనిపిస్తుందా? అలర్ట్ అవ్వండి.. లేదంటే దారి మధ్యలోనే ఆగిపోయే ఛాన్స్ ఉంది..!
చాలా మంది సొంత వాహనాన్ని కలిగి ఉండటానికే ఆసక్తి చూపుతుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దాంతో చాలా మంది సొంతంగా వాహనాలను కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. కరోనా సంక్షోభం సమయంలో కూడా కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. ఆ తరువాత కూడా కార్ల విక్రయాలు..

కార్ల వినియోగానికి సంబంధించి వివరాలను పరిశీలిస్తే బిఫోర్ కరోనా.. ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు. కరోనా నేర్పిన గుణపాఠం కారణంగా.. చాలా మంది సొంత వాహనాన్ని కలిగి ఉండటానికే ఆసక్తి చూపుతుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దాంతో చాలా మంది సొంతంగా వాహనాలను కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. కరోనా సంక్షోభం సమయంలో కూడా కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. ఆ తరువాత కూడా కార్ల విక్రయాలు జోరు తగ్గలేదు. ఫలితంగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ కార్ల సంఖ్య భారీగా పెరిగింది. రోడ్లపై రద్దీ కూడా పెరిగింది.
అయితే, కారు కొనడం ఒక ఎత్తైతే.. ఆ కారును మేయింటేన్ చేయడం మరో ఎత్తు. ఏమాత్రం సమస్య వచ్చినా వెంటనే బాగు చేయించుకోవాలి. లేదంటే మార్గం మధ్యలో అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక కారు మొత్తంలో బ్యాటరీ చాలా ముఖ్యమైన భాగం. ఆ బ్యాటరీ ఆధారంగానే కారులోని ఫీచర్స్ అన్నీ పని చేస్తాయి. బ్యాటరీ పాడైపోతే.. ఆ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
కాలక్రమేణా కారు బ్యాటరీ కూడా డౌన్ అవుతుంది. అందులో లోపాలు ఏర్పడుతాయి. ఆ లోపాల కారణంగా కారులో సమస్యలు తలెత్తుతాయి. బ్యాటరీకి సంబంధించిన లోపం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. లేదంటే కారు మార్గం మధ్యంలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. మరి ప్రయాణంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. మీ ప్రయాణం హాయిగా సాగాలంటే ఈ లోపాలను గుర్తించడం చాలా ముఖ్యం. మరి బ్యాటరీ వైఫల్యాన్ని గుర్తించడంలో ఉపకరించే కొన్ని సంకేతాలను ఇప్పుడు మనం చూద్దాం. వాస్తవానికి కారులో ఎలక్ట్రిక్ సిస్టమ్‌కు బ్యాటరీ చాలా కీలకం. బ్యాటరీ పాడైపోతే హెడ్ లైట్స్, ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాలు పని చేయవు.




బ్యాటరీ డౌన్ అయినట్లు ఎలా గుర్తించాలి?
1. కారు స్టార్టింగ్‌లో పెద్ద శబ్దం వస్తే బ్యాటరీ వీక్ అయినట్లుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను వెంటనే చెక్ చేసుకోవాలి. లేదంటే ప్రయాణం మధ్యలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
2. కారు స్టార్ట్ చేయడం కోసం ‘కీ’ ని తిప్పినప్పుడు వింత శబ్ధాలు వినిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. సాధారణ శబ్దానికి భిన్నంగా క్రాంకింగ్ శబ్దం వస్తే బ్యాటరీ వీక్ అవుతుందని అర్థం.
3. బ్యాటరీ లోపం కారణంగా లైట్ స్పార్క్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అగ్ని ప్రమాదం జరుగుతుంది. అందుకే బ్యాటరీ సామర్థ్యాన్ని అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి.
4. బ్యాటరీపై తుప్పు పట్టినట్లు కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి పరిశీలించాలి. సాధారణంగా 2-3 సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చడం ఉత్తమం.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..