Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Mileage Tips: మీ కారు మైలేజ్ ఆకస్మాత్తుగా పడిపోయిందా? ఇలా చేస్తే ఈజీగా మైలేజీ పెరుగుతుంది..

ఏదైనా టెక్నికల్ సమస్య ఉన్నా కారు మైలేజీ క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా జేబుకు చిల్లు పడుతుంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో.. కారు మైలేజీ తక్కువ ఇస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మీ కారు కూడా మైలేజీ పడిపోయి, ఇంధనం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారా? ఈ టిప్స్ మీకు ఉపకరిస్తాయి. వీటిని పాటించడం ద్వారా మీ కారు మైలేజీని ఈజీగా పెంచుకునే అవకాశం ఉంది.

Car Mileage Tips: మీ కారు మైలేజ్ ఆకస్మాత్తుగా పడిపోయిందా? ఇలా చేస్తే ఈజీగా మైలేజీ పెరుగుతుంది..
Tips To Increase Car Mileag
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2023 | 1:10 PM

కారు కొన్న కొత్తలో కాస్త మైలేజీ తక్కువగా ఇస్తుంది. ఆ తరువాత సర్వీస్ చేయించే కొద్ది మైలేజీ పెరుగుతంది. ఇక కారు పాతపడే కొద్ది, వినియోగం సరిగా లేకపోయినా, ఏదైనా టెక్నికల్ సమస్య ఉన్నా కారు మైలేజీ క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా జేబుకు చిల్లు పడుతుంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో.. కారు మైలేజీ తక్కువ ఇస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మీ కారు కూడా మైలేజీ పడిపోయి, ఇంధనం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారా? ఈ టిప్స్ మీకు ఉపకరిస్తాయి. వీటిని పాటించడం ద్వారా మీ కారు మైలేజీని ఈజీగా పెంచుకునే అవకాశం ఉంది. తద్వారా ఎంత దూరమైనా హాయిగా ప్రయాణించొచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కారు మైలేజీని ఈ విధంగా పెంచుకోండి..

1. కారు మైలేజీని పెంచుకోవడానికి, ఇంజిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సులభమైన, అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి టైర్‌లో గాలి నిర్వహణ సరిగా చూసుకోవాలి. టైర్లలో గాలి తగ్గితే.. ఆటోమేటిక్‌గా మైలేజీ కూడా తగ్గుతుంది. అందుకే డ్రైవ్ చేయడానికి ముందు మీ కారు టైర్ పరిస్థితిని చెక్ చేసుకోవాలి.

2. ప్రయాణంలో కారు కిటికీలను తెరిచి ఉంచడం వల్ల కూడా కారు మైలేజీ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా కారు ఇంజిన్ వేగం తగ్గి, ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ప్రయాణ సమయంలో కారు అద్దాలు పూర్తిగా మూసివేయాలి.

ఇవి కూడా చదవండి

3. అధిక వేగం కూడా కారు మైలేజీపై ప్రభావం చూపుతుంది. కారును ఎప్పుడూ ఒకే స్పీడ్‌తో మెయింటెన్ చేస్తూ, సాఫీగా నడపాలి. కారు వేగాన్ని ఒకేవిధంగా నిర్వహిస్తే.. మైలేజీని 30 శాతం వరకు పెంచుకోవచ్చు.

4. ఇక మైలేజీని మెరుగుపరుచుకోవడానికి మోటార్ ఆయిల్‌ నాణ్యమైనది ఎంచుకోవాలి. చాలా కార్లలో సరైన ఆయిల్ యూజ్ చేయకపోవడం మైలేజీ తగ్గుతుంది. సరైన ఆయిల్‌ను అప్‌గ్రేడ్ చేయడం ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి.. మైలేజీ పెరుగుతుంది.

5. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే కారు ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. అలాగే అవసరం లేకుండా ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచొద్దు. తరచుగా బ్రేక్స్ వేయడం వల్ల కూడా మైలేజీ తగ్గుతుంది.

ఈ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి..

కారు కొనాలనుకునే ప్రజలు ముందుగా సెక్యూరిటీ ఫీచర్లను చూసుకుంటారు. ఆ తరువాత మైలేజీని చెక్ చేస్తారు. అయితే, ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రదానంగా 5 కార్లను చెప్పొచ్చు. మారుతి వ్యాగన్ ఆర్ టూర్, మారుతి ఎస్ ప్రెస్సో, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి ఆల్టో కే10, హోండా సిటీ హైబ్రిడ్ ప్రధానంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..