AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Castor Oil for Hair: ఒత్తైన జుట్టుకు ఆముదం నూనె బెస్ట్ ఎంపిక.. ఏ విధంగా జుట్టుకు అప్లై చేయాలంటే..

చాలా మంది కనుబొమ్మలు, కనురెప్పలను మందంగా మార్చుకోవడానికి ఆముదం ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం వరకూ జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు సంరక్షణ కోసం ఆముదాన్ని ఉపయోగించేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పులో భాగంగా జుట్టు సంరక్షణలో కూడా మార్పులు వచ్చాయి, అయితే ఇప్పుడు మళ్ళీ పాత పద్దతులను ఉపయోగిస్తూ జుట్టు సంరక్షణ కోసం ఆముదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ నూనె జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

Surya Kala
|

Updated on: Aug 08, 2023 | 3:01 PM

Share
జుట్టు సంరక్షణకు నూనె అవసరం. అయితే జుట్టుకు ఏ నూనె మంచిది అనేది చాలా మందికి తెలియదు. అయితే జుట్టు సంరక్షణలో ఆముదం ఉపయోగించడం వలన అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీ జుట్టు సంరక్షణ కోసం ఆముదంపై ఆధారపడండి.  

1 / 6
ఆముదంలో ప్రొటీన్, విటమిన్ ఇ, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు మీ జుట్టుకు ఆముదం నూనెను క్రమం తప్పకుండా రాసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.  ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

2 / 6
వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జుట్టు మూలాలను బలపరుస్తుంది.

3 / 6
ఆముదంలో ఒమేగా-6 , ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తలలో తేమను నిర్వహించడానికి సహాయపడతాయి. మీరు ఆముదం నూనె అప్లై చేయడం ద్వారా పొడి జుట్టును సులభంగా వదిలించుకోవచ్చు. ఆముదంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ నూనెను రాసుకోవడం వల్ల చుండ్రు, దురదలు సులభంగా తొలగిపోతుంది. 

4 / 6

అందమైన, బలమైన జుట్టు కోసం విటమిన్ ఇ అవసరం. విటమిన్ ఇ జుట్టు సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. ఆముదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది మీకు పొడవాటి, మందపాటి జుట్టును ఇస్తుంది. కనుక మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఆముదం ఉపయోగించవచ్చు.

5 / 6
అయితే ఆముదాన్ని నేరుగా జుట్టుకు అప్లై చేయవద్దు. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపిన ఆముదం ఉపయోగించండి.

6 / 6