Oppo A58 4G: రూ. 15వేలలో 50 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో కొత్త స్మార్ట్ ఫోన్‌

యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా క్లారిటీ ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫోన్‌లు లాంచ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు 50 ఎంపీ క్లారిటీ ఉండే ఫోన్‌ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 30 వేలు పెట్టాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం రూ. 15 వేలలోనే అలాంటి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ఒప్పో ఏ58 స్మార్ట్ ఫోన్‌. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 08, 2023 | 2:01 PM

ఒప్పో ఏ58 పేరుతో 4జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది. భారత మార్కెట్లో 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

1 / 5
 ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియా టెక్‌ హెలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
2.8డీ కర్వ్‌డ్ బాడీ, గ్లోయింగ్ స్కిల్ డిజైన్‌ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యుయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.

3 / 5
 ఇక సెక్యూరిటీ కోసం ఇందులో బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ సెన్సర్‌ను అందించారు. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us