Madras High Court: భర్తల కోసం అలాంటి చట్టం లేకపోవడం దురదృష్టకరం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Madras High Court on domestic violence: మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యల రక్షణకు గృహహింస నిరోధక చట్టం ఉన్నట్టు భర్తలకూ ఓ చట్టం అనేది లేకపోవడం

Madras High Court: భర్తల కోసం అలాంటి చట్టం లేకపోవడం దురదృష్టకరం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Madras High Court
Follow us

|

Updated on: Jun 02, 2021 | 7:55 PM

Madras High Court on domestic violence: మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యల రక్షణకు గృహహింస నిరోధక చట్టం ఉన్నట్టు భర్తలకూ ఓ చట్టం అనేది లేకపోవడం దురదృష్టకరమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పి. శశికుమార్ అనే వెటర్నెరీ వైద్యుడు దాఖలు చేసిన రిట్ పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎస్ వైద్యనాథన్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన శశికుమార్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆయన భార్య ఉన్నతాధికారులకు 2020 ఫిబ్రవరి 18న ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు శశికుమార్‌ను విధుల నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేస్తూ శశికుమార్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే వారి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే భార్య ఫిర్యాదు చేసిన మరుసటి రోజే వారికి విడాకులు సైతం మంజూరు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. ఇదే విషయాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి.. శశికుమార్ భార్య దురుద్దేశంతోనే ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చిందని స్పష్టమవుతోందంటూ వ్యాఖ్యానించారు. విడాకులు ఖాయమని అర్థమైన తరువాతే సదరు మహిళ శశికుమార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఇలా ఫిర్యాదు చేసిందని.. ఇది స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. వ్యక్తుల జీవితంలో వివాహానికి ఎంతో పవిత్రత ఉందని అయితే.. గృహహింస చట్టం కారణంగా సహజీవనానికి కూడా చట్టబద్ధత లభించిందని.. దీని కారణంగా పవిత్రత అనే పదానికి అర్థం లేకుండా పోయిందని న్యాయమూర్తి వైద్యానథన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. శశికుమార్‌ను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

COVID-19 vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో భారత్ మరో రికార్డు.. 22 కోట్లు దాటిన డోసుల సంఖ్య

Juhi Chawla: హైకోర్టులో విచారణ… నటి జూహీ చావ్లాను చూసి పాటలు పాడిన ఆకతాయి.. సీరియస్ అయిన జడ్జి ఏం చేశాడంటే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో