ఆరేళ్ళ బాలుడి మృతికి కారకుడంటూ కర్ణాటకలో డాక్టర్ పై దాడి….. నలుగురి అరెస్ట్..
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధికి గురైన ఆరేళ్ళ బాలుడి మృతికి ఓ డాక్టర్ బాధ్యుడంటూ ఆయనపై దాడి చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధికి గురైన ఆరేళ్ళ బాలుడి మృతికి ఓ డాక్టర్ బాధ్యుడంటూ ఆయనపై దాడి చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కమగళూరు తాలూకా తరికెరె టౌన్ లో భువన్ అనే ఈ చిన్నారికి వైద్య చికిత్స చేసిన డాక్టర్ దీపక్ మీద ఎటాక్ కి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ డాక్టర్ ట్రీట్ మెంట్ చేసినప్పటికీ భువన్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అతడిని శివమోగాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భువన్ మరణించాడు. అయితే ఆ చిన్నారి మృతికి దీపక్ బాధ్యుడంటూ నలుగురు వ్యక్తులు 50 ఏళ్ళ ఆయనపై నడి రోడ్డులో అడ్డగించి పిడిగుద్దులు కురిపించారు. స్పృహ కోల్పోయి పడిపోయిన ఆయనను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన డాక్టర్ దీపక్ ని కొందరు వ్యక్తులు శివమొగా ఆసుపత్రికి తరలించారని, 18 గంటల్లో ఈ నలుగురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా ఈ విధమైన ఘటనలను అరికట్టేందుకు లీగల్ సెల్ ను ఏర్పాటు చేయాలను కర్ణాటకలోని రెసిడెంట్ డాక్టర్ల సంఘం సీఎం యెడియూరప్ప ను కోరింది.
అటు-అస్సాంలో కోవిద్ రోగి మృతికి కారకుడంటూ ఓ డాక్టర్ పై ఆ రోగి తాలూకు బంధువులు ఎటాక్ చేయడంతో ఆ డాక్టర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా అక్కడక్కడా జరుగుతున్న ఈ విధమైన ఘటనలను నివారించేందుకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నా ఆ దిశగా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
మరిన్ని ఇక్కడచూడండి: Artificial Sun: అసలు సూర్యుడి కంటె పదిరెట్లు ఎక్కువ వేడి..రికార్డు సృష్టించిన చైనా రెండో సూరీడు
Artificial Sun: అసలు సూర్యుడి కంటె పదిరెట్లు ఎక్కువ వేడి..రికార్డు సృష్టించిన చైనా రెండో సూరీడు