AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instant Loan Apps Case: లోన్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్‌.. లంచం తీసుకుంటూ బయటపడ్డ ఈడీ అధికారి బాగోతం..!

చైనీస్ నిర్వహిస్తున్న బ్యాంక్ అకౌంట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సీజ్ చేశారు. ఈ అకౌంట్లను తిరిగి తిరిచేందుకు లోన్ యాప్ మాయగాళ్ల నుంచి లంచం తీసుకున్న ఈడీ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.

Instant Loan Apps Case: లోన్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్‌.. లంచం తీసుకుంటూ బయటపడ్డ ఈడీ అధికారి బాగోతం..!
Instant Loan Apps Case
Balaraju Goud
|

Updated on: Jun 02, 2021 | 8:41 PM

Share

ED Officer Lalit Bazad arrests Instant loan apps case: చైనా ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ కేసు మరో మలుపు తిరిగింది. ప్రజలకు ఉరితాళ్లుగా మారిన మాయదారి లోన్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ నిర్వహిస్తున్న బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఈ అకౌంట్లను తిరిగి తిరిచేందుకు లోన్ యాప్ మాయగాళ్ల నుంచి లంచం తీసుకున్న ఈడీ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.

అకౌంట్స్‌ను డీఫ్రీజ్ చేసందుకు ముంబయికి చెందిన అపోలో ఫైన్ వెస్ట్ ఎండీ నుంచి ఈడీ అధికారి లలిత్ బజాద్ ఐదు లక్షల రూపాయల లంచం తీసుకున్నారు. బెంగళూరులోని బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి అకౌంట్లను తిరిగి తెరిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు.. సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో లలిత్‌ బజాద్‌ను సీబీఐ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.

వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన మాయదారి లోన్ యాప్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు అష్ట కష్టాలు పడ్డారు. ప్రజల నుంచి అక్రమంగా కొల్లగొట్టిన సొమ్ముని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోన్ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటి అకౌంట్లను సీజ్ చేశారు. ఇలాంటి కీలకమైన కేసులో ఈడీ అధికారి యాప్‌ల అక్రమార్కులకు సహకరించిన తీరు చూసి పోలీసులు షాక్ తిన్నారు.

ఇదిలావుంటే, చైనా ఆన్‌లైన్ డిజిటల్ లోన్‌ యాప్ కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 17 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తి రుణ యాప్‌లను రూపొందించడంతో పాటు వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లాంబోని ఒక రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. నిందితుడి సెల్‌ఫోన్, లాప్‌టాప్, ఐపాడ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలు అన్నీ చైనా భాషలోనే ఉండటంతో, ఆ భాష తెలిసిన వాళ్ల సాయం తీసుకొని దర్యాప్తు కొనసాగించారు. రుణ యాప్‌ల బండారం బయటపడిన తర్వాత తన లాప్‌టాప్‌ నుంచి లాంబో కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు గుర్తించారు. కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్‌టాప్‌లోని సమాచారాన్ని సైబర్‌ క్రైం పోలీసులు సేకరించారు. ఇదే క్రమంలో బెంగళూరులో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Read Also…  ఆరేళ్ళ బాలుడి మృతికి కారకుడంటూ కర్ణాటకలో డాక్టర్ పై దాడి….. నలుగురి అరెస్ట్..

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి