Tungabhadra Dam: ఆపరేషన్‌ తుంగభద్ర కంటిన్యూ.. డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ పనులు.. తాత్కాలిక గేటుతో 15 లక్షల ఎకరాలకు భరోసా

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌...19వ గేటు నుంచి నాన్‌స్టాప్‌గా నీటి ప్రవాహం దూకుతోంది. దానిని స్టాప్‌ లాక్‌తో క్లోజ్ చేయడానికి ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం నానా కష్టాలు పడుతోంది. అటు వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతుండడంతో దానికి ఎదురీది పనిచేయాల్సి వస్తోంది. వరద నీటిలో దిగి స్టాప్‌ లాక్‌ అమర్చాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ అటు చాలెంజ్‌గాను, ఇటు ప్రమాదకరమైన సాహసంగా కూడా పరిణమించింది.

Tungabhadra Dam: ఆపరేషన్‌ తుంగభద్ర కంటిన్యూ.. డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ పనులు.. తాత్కాలిక గేటుతో 15 లక్షల ఎకరాలకు భరోసా
Tungabhadra Dam Gate
Follow us

|

Updated on: Aug 17, 2024 | 6:34 AM

వరదకు ఎదురీది డ్యామ్‌ గేటు బిగించాలి. ఇంజనీరింగ్‌ నిపుణుల సాహసానికి, నైపుణ్యానికి తుంగభద్ర ఛాలెంజ్‌ విసురుతోంది. ఆ సవాల్‌ని స్వీకరించి, తుంగభద్ర దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. ఉరకలు వేసే ప్రవాహానికి స్టాప్‌ లాక్‌తో కళ్లెం వేయాలి. అదెలా జరుగుతుందా అని ఊపిరి బిగబట్టి… దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. చివరి నిమిషంలో చీకటి పడడంతో ఈ ప్రక్రియ ఇవాల్టికి వాయిదా పడింది. దీంతో ఆపరేషన్‌ తుంగభద్ర కంటిన్యూస్‌.

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌…19వ గేటు నుంచి నాన్‌స్టాప్‌గా నీటి ప్రవాహం దూకుతోంది. దానిని స్టాప్‌ లాక్‌తో క్లోజ్ చేయడానికి ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం నానా కష్టాలు పడుతోంది. అటు వేలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతుండడంతో దానికి ఎదురీది పనిచేయాల్సి వస్తోంది. వరద నీటిలో దిగి స్టాప్‌ లాక్‌ అమర్చాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ అటు చాలెంజ్‌గాను, ఇటు ప్రమాదకరమైన సాహసంగా కూడా పరిణమించింది.

5 యూనిట్లుగా విభజించి పనులు ప్రత్యేక క్రేన్ల సాయంతో పనులు

కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాక్ అమర్చే పనులు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. అవి శుక్రవారం కూడా కొనసాగాయి. అయితే కొట్టుకుపోయిన గేట్‌ ఇనుప ముక్కలు అడ్డు రావడంతో ఆ పనులకు టెంపరరీగా బ్రేక్ పడింది. ఇక శుక్రవారం నాడు నిపుణుల ద్వారా అడ్డుగా ఉన్న ఇనుప ముక్కలను తొలగించారు. ఈ స్టాప్‌ లాక్‌ గేటు వెడల్పు 60 అడుగులు కాగా.. పొడవు 20 అడుగులు. 75 టన్నుల బరువున్న స్టాప్‌ లాక్‌ను ఒకేసారి అమర్చడానికి వీలు లేకపోవడంతో, దాన్ని 5 యూనిట్లుగా విభజించి పనులు ప్రారంభించారు. అంటే ఒక్కో యూనిట్‌…60 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉంటుంది. మొదటి దశలో నాలుగు అడుగుల ఎత్తులో మూడు యూనిట్లను ఒకదానికొకటి అతికించి అమర్చనున్నారు. జిందాల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెండు క్రేన్ల సాయంతో 60 అడుగుల వెడల్పు.. 20 అడుగుల ఎత్తులో తాత్కాలిక గేటు అమర్చేందుకు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

వరద నీటితో చెలగాటం.. సాహసం చేస్తున్న ఇంజనీరింగ్‌ టీమ్‌

తాత్కాలిక గేటును అమర్చే క్రమంలో సుమారు 20 అడుగుల నీటిలోకి క్రేన్‌ ద్వారా నిపుణులను పంపారు. కానీ నీటి ప్రవాహం కారణంగా పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పనులు నిలిపివేశారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం..పనులకు ఆటంకంగా మారింది. వాస్తవానికి.. తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చడం చాలా పెద్ద ఛాలెంజ్‌. ఎందుకంటే.. భారీ వరద ప్రవాహంలో గేటును అమర్చడం అంత ఈజీ పని కాదు. ఎంతో బరువు ఉన్న ఇనుప గేటును ఫోర్సుగా వెళుతున్న నీటిలో దింపి.. వాటర్ కెమెరాలు.. ఆక్సిజన్ మాస్కులతో కొంతమంది నిపుణులు నీళ్లలోకి దిగి ఆ గేటును దిమ్మమీద అమర్చాల్సి ఉంటుంది. దానికోసం ఇంజనీరింగ్‌ టీమ్‌ ఎంతో సాహసం చేస్తోంది.

మొదటి యూనిట్‌ని దించే ప్రయత్నాలు..ఇవాళ అమర్చే అవకాశం

ప్రత్యేక క్రేన్ల ద్వారా 13 టన్నుల బరువు ఉన్న స్టాప్ లాక్ మొదటి యూనిట్‌ని దించే ప్రయత్నాలు చేశారు. మొదట యూనిట్ దించేందుకు మార్గం సుగమం అయింది. అయితే చీకటి పడిపోవడంతో ఈ ప్రక్రియ ఇవాల్టికి వాయిదా పడింది. ఇవాళ మొదటి యూనిట్ అమర్చే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అదే గనుక జరిగితే..దేశ ఇంజినీరింగ్ చరిత్రలో అద్భుతఘట్టం ఆవిష్కృతం కాబోతోందని అంటున్నారు.

మొదటి యూనిట్‌ను విజయవంతంగా అమర్చగలిగితే…మిగిలిన 4 యూనిట్లు అమర్చడం పెద్ద సమస్య కాదంటున్నారు నిపుణులు. ఇదే గనుక జరిగితే.. 2 టీఎంసీలకు పైగా నీటిని సేవ్ చేయడమే కాకుండా.. పైనుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను కూడా స్టోర్ చేయవచ్చని ఎక్స్‌పర్ట్ష్‌ భావిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ తాత్కాలిక గేటు అమర్చే ప్రక్రియ సక్సెస్‌ అయితే.. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ముందుకెళ్లవచ్చు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక కర్నాటకలో మళ్లీ భారీ వర్ష సూచన ఉండడంతో వరదలు పోటెత్తే అవకాశం ఉంది. ఆ లోపలే స్టాప్‌ లాక్‌ను అమర్చాల్సి ఉంటుంది. దీంతో ఇంజనీరింగ్‌ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ స్టాప్ లాక్‌ అమర్చే ప్రయత్నంలో ఉంది తుంగభద్ర డ్యామ్‌ బోర్డు. మళ్లీ వారం రోజుల్లో డ్యామ్‌ నిండిపోయే లోపల ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల్లో తాత్కాలిక గేటు అమర్చగలితే…. 15 లక్షల ఎకరాలకు సాగు నీటి భరోసా లభిస్తుంది. రాయలసీమ రైతులతో పాటు తెలంగాణలోని గద్వాల జిల్లా రైతులకు కూడా మేలు జరుగుతుంది. దీంతో ఈ ప్రక్రియ త్వరగా విజయవంతం కావాలని అంతా ఆశిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..