Delhi Government: ఢిల్లీలో విషమించిన పరిస్థితి.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
దేశ రాజధానిలో వాయుకాలుష్యం రోజు రోజుకూ కోరలు చాస్తోంది. అసలే చలికాలం.. పైగా వాయునాణ్యతా సూచీలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు కనిపించడం కూడా కష్టంగా మారింది. పూర్తి మసకబారిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు

దేశ రాజధానిలో వాయుకాలుష్యం రోజు రోజుకూ కోరలు చాస్తోంది. అసలే చలికాలం.. పైగా వాయునాణ్యతా సూచీలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో రోడ్లపై ప్రజలు కనిపించడం కూడా కష్టంగా మారింది. పూర్తి మసకబారిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీలో వాయుకాలుష్యం రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 10-15 రోజులుగా అధిక ప్రభావం చూపుతున్నప్పటికీ ఈ రెండు, మూడు రోజుల్లో దీని పరిస్థితి మునుపటి కంటే భిన్నంగా మారింది. మన్నటి వరకూ 300 నుంచి 400 మధ్య ఉన్న వాయునాణ్యత సూచీ ఏకంగా 600 నుంచి 700 పెరిగిపోయింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించారు. నవంబర్ 10వ తేదీ నుంచి ఈ రూల్ అమలు కానుంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులు ఆన్లైన్‌లోనే పాఠాలు వినాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
"As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP
— ANI (@ANI) November 5, 2023
ప్రస్తుతం గాలిలోని విషవాయువుల శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన ప్రమాణాల కంటే అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆదివారం ఏక్యూఐ 401 కాగా శనివారం జహంగీర్‌పురిలో 702కు చేరింది. అలాగే సోనియా విహార్‌లో 618కి పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ గాలిని పీల్చడంతోపాటూ తిరగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో పాటూ చర్మ సంబంధమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణుల అంచనా వేస్తున్నారు. ఢిల్లీతో పాటూ ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని పొల్యూషన్ జోన్ గా ప్రకటించారు. రానున్న రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చితే పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఎవరూ టపాసులు కాల్చకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి క్రాకర్స్ కాల్చితే పరిస్థితి నియంత్రణలోకి వచ్చే అవకాశం లేదని ముందుగానే హెచ్చరిస్తున్నారు.
#WATCH | Delhi: ANI drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 9:15 am today.
The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/6yfIjGq0kV
— ANI (@ANI) November 5, 2023
#WATCH | The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board).
(Visuals from Chanakyapuri area, shot at 8:40 am) pic.twitter.com/aWTVUauThG
— ANI (@ANI) November 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి