BJP Leader Murder Case: మావోయిస్టుల చేతిలో బీజేపీ నేత దారుణ హత్య.. పదునైన ఆయుధాలతో వెంటాడి మరీ..
నారాయణపూర్ జిల్లా ఉపాధ్యక్షుడు రతన్ దూబే (57) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసల్‌నార్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రచారం ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి కారులో వస్తుండగా గ్రామశివారులో కాపుకాసిన కొందరు మావోయిస్టులు ఆయనపై కాల్పులు జరిపారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో కిందపడ్డాడు. మావోయిస్టులు వెంటనే అతడిని పట్టుకుని పదునైన మారణాయుధాలతో నరికి దారుణంగా హత్యచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మావోయిస్టులు రాజకీయ నాయకులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై అడిషనల్ పోలీసు..

ఛత్తీస్‌గఢ్, నవంబర్ 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు భాజపా నేతను శనివారం (నవంబర్ 4) దారుణంగా హత్యచేశారు. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తుండగా ఝరాఘటి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్‌నగర్ గ్రామంలోని మార్కెట్‌లో సాయంత్రం 5:30 గంటలకు ఈ దాడి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నారాయణపూర్ జిల్లా ఉపాధ్యక్షుడు రతన్ దూబే (57) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసల్‌నార్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రచారం ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి కారులో వస్తుండగా గ్రామశివారులో కాపుకాసిన కొందరు మావోయిస్టులు ఆయనపై కాల్పులు జరిపారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో కిందపడ్డాడు. మావోయిస్టులు వెంటనే అతడిని పట్టుకుని పదునైన మారణాయుధాలతో నరికి దారుణంగా హత్యచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మావోయిస్టులు రాజకీయ నాయకులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ హేమసాగర్ సిదర్ మాట్లాడుతూ..
‘నారాయణపూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ దాడిలో సంఘటన స్థలంలోనే అతను చనిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వారి జాడ కోసం భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తగిన భద్రత కల్పించామని, అయితే దూబే పర్యటన గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని’ ఆయన అన్నారు.
ఎన్నికలకు ముందు నక్సలైట్లు బీజేపీ నేతను హత్య చేయడంతో ప్రజల్లో భయాందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాంటి హత్యలు జరిగాయి. దీనికి కొద్ది రోజుల ముందు నక్సలైట్లు మోహ్లా-మన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలోని ఔంధీలో బీజేపీ నాయకుడు బిర్జురామ్‌ను కాల్చి చంపారు. సాయుధ నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నక్సలైట్లు బీజేపీ అభ్యర్థి దర్బార్ సింగ్‌ను ఇదే రీతిలో హత్య చేసిన సంగతి విధితమే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.