AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Election: తెలుగు నేతలంతా హస్తినలోనే.. ఫైనల్ టచ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు సత్తా చాటారు. బీజేపీ అభ్యర్ధుల తరపున కేంద్రమంత్రి బండి సంజయ్‌ , ఎంపీలు ఈటల రాజేందర్‌ , డీకే అరుణ ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. ఇక సోమవారమే ప్రచారానికి చివరి రోజు.. దీంతో అన్ని పార్టీలు హై స్పీడ్‌ జోన్‌లోకి వచ్చాయి...

Delhi Election: తెలుగు నేతలంతా హస్తినలోనే.. ఫైనల్ టచ్
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2025 | 6:36 AM

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. బీజేపీ అభ్యర్ధుల తరపున పలువురు తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వాళ్లు ప్రచారం చేశారు. తూర్పు ఢిల్లీ , షాంద్రా ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రచారం చేశారు. బండి సమక్షంలో బీజేపీలో చేరారు 30 మంది ఆప్ కార్యకర్తలు. మూడు రోజుల పాటు బీజేపీ అభ్యర్ధుల తరపున బండి సంజయ్‌ ప్రచారం చేశారు.

ఢిల్లీలో దాదాపు 8 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. మూడు పార్టీల మధ్య టఫ్‌ ఫైట్‌ ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఆప్‌ , బీజేపీ మధ్య హో్రాహొరి పో్టీ జరుగుతోంది. దీంతో ప్రతి ఓటు చాలా కీలకంగా మారింది. అందుకే అన్ని పార్టీలు ఏ అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని ఎన్డీఏ మిత్రపక్షాలను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించారు. మోదీ ఆహ్వానంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. షాద్రా నియోజకవర్గంలో తెలుగు ఓటర్లతో మాట్లాడారు.

ఢిల్లీ నగరంలోని అన్నిప్రాంతాల్లో ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ప్రచారం చేస్తున్నారు. త్రీనగర్, ఓంకార్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం చేశారు. షాద్రాలో సాయంత్రం గం. 7.00కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రాజోరి గార్డెన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లతో ముచ్చటించారు ఎంపీ డీకే అరుణ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు న్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బీజేపీ ఎంఎల్ఏ అభ్యర్థి అజయ్ మహావర్ ను గెలిపించాలని, డిల్లీలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారికి మరింత బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఈటల . ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్‌ 16 నెలలు జైల్లో ఉన్నారని అన్నారు. డిల్లీలో 25 ఏళ్ళ తరువాత బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. మధ్యతరగతి ప్రజల కోసం ప్రధాని మోదీ బడ్జెట్‌లో వరాలు ప్రకటించారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ చాలా గొప్పగా ఉందని , ఢిల్లీలో మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన 70 స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుంది. గెలుపుపై అటు ఆప్‌ ,ఇటు బీజేపీ నేతలు చాలా దీమాగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..