Maha Kumbh 2025: వసంత పంచమి వేళ.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. ఇవిగో ఆ అద్భుత దృశ్యాలు
సోమవారం తెల్లవారుజామున 4 గంటల నాటికి 1.65 మిలియన్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలోనే మహా కుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాల కోసం రెట్టింపు సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఫిబ్రవరి 3 సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీసంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున 4 గంటల నాటికి 1.65 మిలియన్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.
బసంత్ పంచమిని భక్తులు విశేషంగా జరుపుకుంటారు. సరస్వతి మాత బసంత్ పంచమి నాడు జన్మించిందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున గంగలో స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..