మహిళలను ఉచిత పథకాలతో పోల్చిన అన్నాడీఎంకే నేత.. సీవీ షణ్ముగం వ్యాఖ్యలపై దుమారం!
మహిళలను ఉచిత పథకాలతో పోల్చుతూ అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓట్ల కోసం భార్యలను కూడా ఉచితంగా ఇచ్చే స్కీమ్‌లు తీసుకొస్తారన్న షణ్ముగం కామెంట్స్‌పై అధికార పార్టీ డీఎంకే తోపాటు.. తమిళనాడు ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

మహిళలను ఉచిత పథకాలతో పోల్చుతూ అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓట్ల కోసం భార్యలను కూడా ఉచితంగా ఇచ్చే స్కీమ్‌లు తీసుకొస్తారన్న షణ్ముగం కామెంట్స్‌పై అధికార పార్టీ డీఎంకే తోపాటు.. తమిళనాడు ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
అన్నాడీఎంకే బూత్ కమిటీ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న AIDMK నేత, మాజీ మంత్రి షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం చాలా హామీలు గుప్పిస్తారు. మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులు ఫ్రీగా ఇస్తామని చెబుతారు. అంతేకాదు ప్రతి వ్యక్తికి ఒక భార్యను కూడా ఫ్రీగా ఇవ్వవచ్చు’ అంటూ నోరు జారారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. మాజీ సీఎం కరుణానిధి కొడుకు కాబట్టి అలాంటి వాగ్దానాలు చేయగల సామర్థ్యం ఉందని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలను కించపరిచేలా ఆయన చేసిన కామెంట్స్‌ను అధికార డీఎంకే తీవ్రంగా ఖండించింది. తమిళనాడు మహిళా మంత్రి గీతాజీవన్ ఘాటుగా స్పందించారు. షణ్ముగం వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల పట్ల ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకుల వికృత దురుద్దేశాన్ని బయటపెట్టాయని ఆరోపించారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి గీతా గుర్తు చేశారు. దివంగత జయలలిత బతికుంటే షణ్ముగం ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా? అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిసామి షణ్ముగం వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని మంత్రి గీతా నిలదీశారు.
ఇక.. ఉచిత పథకాల విషయాల్లో అన్నాడీఎంకే కూడా తక్కువేం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2011 ఎన్నికల్లో మిక్సీలు, గ్రైండర్లు ఇస్తామని డీఎంకే ప్రకటించగా.. అన్నాడీఎంకే ప్రతి మహిళకు ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. అటు.. షణ్ముగం వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకత్వం సైలెంట్‌గా ఉండడంపై తమిళనాడు ప్రజా సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




