AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన స్టాలిన్..

రెండు రోజుల నుంచి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ స్టాలిన్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు.

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన స్టాలిన్..
Cm Stalin
Shaik Madar Saheb
|

Updated on: Jul 14, 2022 | 1:12 PM

Share

MK Stalin Health Updates: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. స్టాలిన్‌కు జూలై 12న (మంగళవారం) కోవిడ్ వైరస్ (Coronavirus) సోకినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల నుంచి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ స్టాలిన్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. MK స్టాలిన్ కోవిడ్ సంబంధిత సమస్యలతో చెన్నైలోని అల్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

కాగా.. ఎంకే స్టాలిన్ వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. స్టాలిన్ కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించారని తెలిసి ఆందోళన చెందానని.. డైనమిక్ పబ్లిక్ లీడర్‌ ఆరోగ్యంగా ఉండాలని.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ గవర్నర్ రవి పేర్కొన్నారు.

స్టాలిన్ త్వరగా కోలుకోవాలని ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషిని కొనసాగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సైతం ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా స్టాలిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..