Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ యువతులే టార్గెట్.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా మరొకరితో..

రెండో పెళ్లి మహిళలనే టార్గెట్‌ చేసి నాలుగేళ్లలో ఒకరికి తెలియకుండా.. మరొకరిని.. ఇలా 8 మందిని పెళ్లిళ్లు చేసుకొని నట్టేట ముంచేశాడు. తమను నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకొచ్చారు నిత్యపెళ్లికొడుకు శివశంకర్‌బాబు బాధితులు.

Hyderabad: ఆ యువతులే టార్గెట్.. వీధికో భార్య.. ఒకరికి తెలియకుండా మరొకరితో..
Hyderabad Nithya Pelli Kodu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 14, 2022 | 8:13 AM

Hyderabad Crime News: నమ్మితే చాలు నట్టేట ముంచేస్తాడు. పెళ్లి పేరుతో ఆశలు రేపి అగాధంలో పడేస్తాడు. అలా, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. మాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా అమ్మాయిలకు వలేయడం, రిజిస్టర్ పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భవతులను చేయడం, ఆ తర్వాత వాళ్ల దగ్గరున్న డబ్బు, బంగారంతో ఉడాయించడం, ఇదీ నిత్యపెళ్లికొడుకు శివశంకర్‌బాబు స్టైల్‌. రెండో పెళ్లి మహిళలనే టార్గెట్‌ చేసి నాలుగేళ్లలో ఒకరికి తెలియకుండా.. మరొకరిని.. ఇలా 8 మందిని పెళ్లిళ్లు చేసుకొని నట్టేట ముంచేశాడు. తమను నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకొచ్చారు నిత్యపెళ్లికొడుకు శివశంకర్‌బాబు బాధితులు. మాయ మాటలతో పెళ్లి చేసుకుని తమను మోసం చేసిన శివశంకర్‌బాబును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ దగ్గర తీసుకున్న డబ్బును తిరిగిస్తానంటున్నాడని, కానీ తమ జీవితాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికా తీసుకెళ్తానంటూ మోసం చేశామతీ.. తమలాగా మరో ఆడపిల్ల మోసపోవద్దనే తాము మీడియా ముందుకు వచ్చామని చెబుతున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన అడపా శివ శంకర్‌ బాబు ప్రైవేట్ ఉద్యోగి. 2018 లో మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మాట్రిమోని సైట్స్‌ ద్వారా రెండో పెళ్లి యువతులను ట్రాప్‌చేసేవాడు. భార్యతో ఉంటూనే అప్పటికే పెళ్లయి భర్తకు దూరంగా ఉంటున్న మరో యువతికి మాయమాటలు చెప్పి.. నకిలీ విడాకుల పత్రాలు చూపించి పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చిందని నమ్మబలికి ఆమె దగ్గర నుంచి లక్షల్లో నగదు తీసుకొని.. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా అమెరికాలో ఐటీ ఉద్యోగమంటూ చెప్పి డబ్బు తీసుకున్నాడు. తర్వాత అదే అమెరికా స్టోరీలతో మరో ఆరుగురిని మోసం చేశాడు. వారిలో ఒకరికి అనుమానం వచ్చి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ఏరియాలో ఉంటూ ఒకరి విషయం మరొకరికి తెలియకుండా నలుగురిని మేనేజ్‌ చేసినట్లు బాధితులు తెలిపారు. నిత్య పెళ్లికొడుకుపై ఆర్‌సి పురం, రాయదుర్గ, కెపిహెచ్‌బి, బాలానగర్‌, ఎల్‌బినగర్‌తో పాటు అనంతపురం, మంగళగిరి పోలీస్‌ స్టేషన్లలో కేసులున్నట్లు బాధిత మహిళలు తెలిపారు. చీటర్‌ శివశంకర్‌ బాబును అరెస్ట్‌చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత మహిళలు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..