AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వికారాబాద్‌ టీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఏకంగా ఆమె కారుపై..

Telangana: వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్‌. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌ మధ్య జరుగుతోన్న..

Telangana: వికారాబాద్‌ టీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఏకంగా ఆమె కారుపై..
Car
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2022 | 8:11 AM

Share

Telangana: వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్‌. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌ మధ్య జరుగుతోన్న గొడవలు రోడ్డునపడ్డాయ్‌. వికారాబాద్‌ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి కారుపై వ్యతిరేక వర్గం ఎటాక్‌ చేయడంతో జిల్లాలో దుమారం రేపుతోంది. మర్పల్లి మండల కేంద్రంలో మహిళా భవనం శంకుస్థాపనకు వచ్చిన జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డికి ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. సునీతామహేందర్‌రెడ్డిని అడ్డుకున్న మర్పల్లి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు, ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. ప్రోటోకాల్‌ పాటించడం లేదంటూ కారు ముందు ఆందోళనకు దిగిన వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్‌ వర్గీయులు.. సునీతామహేందర్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసంచేశారు. మర్పల్లి గడ్డ-ఆనందన్న అడ్డా అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఇదిలాఉంటే.. దాడి తర్వాత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి. ఎమ్మెల్యే ఆనంద్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంప్లైంట్ చేస్తానన్నారు. శిలాఫలకాల్లో తన పేరు పక్కన చదివిన డిగ్రీలు లేవని వాటిని పగలగొట్టిన చరిత్ర ఎమ్మెల్యే ఆనంద్‌కు ఉందన్నారు సునీతామహేందర్‌రెడ్డి. జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడైన ఆనంద్, అందరినీ కలుపుకొని పోకుండా, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారామె. ప్రతి చిన్న విషయాన్నీ కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం ఎందుకని ఇన్నాళ్లూ ఊరుకున్నానని, ఇక అన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అంతేకాదు, ఆనంద్‌ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు వికారాబాద్‌ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?