AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: నేరస్తుల పాలిటి సింహ స్వప్నం కృష్ణ కుమార్ బిష్ణోయ్.. 30 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచి.. ఐపీఎస్ ఎలా అయ్యారంటే

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. కాగా, ఎస్పీ ఐపీఎస్ కృష్ణ కుమార్ బిష్ణోయ్ అంటే కేకే బిష్ణోయ్ కూడా వార్తల్లో నిలిచారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఈ IPS అధికారి UPలోని అత్యంత డైనమిక్, పవర్‌ఫుల్ ఆఫీసర్‌లలో ఒకరు. అతను చాలా భయంకరమైన నేరస్థుల ఆటను అరికట్టాడు.

Success Story: నేరస్తుల పాలిటి సింహ స్వప్నం కృష్ణ కుమార్ బిష్ణోయ్.. 30 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచి.. ఐపీఎస్ ఎలా అయ్యారంటే
Ips Krishan Bishnoi Success Story
Surya Kala
|

Updated on: Nov 25, 2024 | 11:30 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుకు సంబంధించి కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. సర్వే విషయమై మసీదులో జనం తోపులాట సృష్టించారు. జనం పోలీసు బృందంపై రాళ్లు రువ్వడమే కాదు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో ఓ యువకుడు కూడా చనిపోయాడు. ఇంతలో ఈ గలాటాను నియంత్రించడానికి వచ్చిన సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడి భవిష్యత్తును వృధా చేసుకోవద్దని బృందంలోని హింసకు పాల్పడుతున్న యువకులకు వివరించారు. IPS కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఎవరు? అతను ఏ బ్యాచ్ అధికారి? అతని విజయగాథ ఏమిటి? తెలుకుందాం..

కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఎవరు?

కృష్ణ కుమార్ బిష్ణోయ్‌ని కెకె బిష్ణోయ్ అని కూడా అంటారు. అతను 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. కృష్ణ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత శక్తివంతమైన IPS అధికారులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. కృష్ణ కుమార్ మీరట్ పోస్టింగ్ సమయంలో అతను 5 లక్షల రివార్డ్ ఉన్న యుపికి చెందిన భయంకరమైన నేరస్థులలో ఒకరైన బదన్ సింగ్ బద్దో ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఇది మాత్రమే కాదు ముజఫర్‌నగర్ లో విధులను నిర్వహిస్తున్న సమయంలో అతను కరుడుగట్టిన నేరస్థుడు సుశీల్ మూచ్‌ను కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారు. అదే సమయంలో అతను గోరఖ్‌పూర్‌లో సిటీ ఎస్పీగా పోస్టింగ్ పొందినప్పుడు మాఫియాకి చెందిన 800 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేశారు.

ఎక్కడ విద్యాభాసం చేశారంటే ?

ఐపీఎస్ కేకే బిష్ణోయ్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామ నివాసి. తన ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడైన కృష్ణ తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే అభ్యసించారు. ఇతర పిల్లల్లాగే అతను కూడా కాలినడకన పాఠశాలకు వెళ్లేవారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివి జిల్లాకే టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత సికార్‌లోని ఓ పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకుని 10వ పరీక్షలో ఫస్ట్‌ డివిజన్‌తో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం జోధ్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదివి.. డిగ్రీ చదవడం కోసం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

విదేశాల్లో చదువుకోవాలనే కోరిక

ఇంతలో విదేశాల్లో చదవాలనే కోరిక కృష్ణ కుమార్ బిష్ణోయ్‌ కు పుట్టింది. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఫారమ్‌ను నింపి పంపించాడు. అక్కడ కూడా కృష్ణ కుమార్ బిష్ణోయ్‌ కు అదృష్టం కలిసి వచ్చింది. ఉన్నత చదువు కోసం స్కాలర్‌షిప్ కు ఎంపికయ్యారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి రూ. 40 లక్షల స్కాలర్‌షిప్ పొందారు. ఆ తర్వాత 2015లో పారిస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుండి ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. దీని తర్వాత ‘ది ఫ్లెచర్ స్కూల్’లో కూడా విద్యనభ్యసించాడు.

30 లక్షల జీతంతో ఉద్యోగం..

చదువు తర్వాత కృష్ణ కుమార్ బిష్ణోయ్‌ కు ఐక్యరాజ్యసమితి ట్రేడ్‌ సెంటర్‌లో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయితే అక్కడ సుమారు ఏడాది పాటు ఉద్యోగం చేసి.. తర్వాత ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి భారత్ కు తిరిగి వచ్చారు. ఇక్కడ కృష్ణ కుమార్ JNU నుంచి ఎంఫిల్ చేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేయడం ప్రారంభించారు. తర్వాత అతనికి ఐపీఎస్‌ అధికారి కావాలనే కోరిక పుట్టింది. ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ ద్వారా UPSCకి ప్రిపేర్ కావడం మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో కేవలం 24 ఏళ్లకే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌ అయ్యారు కృష్ణ కుమార్ బిష్ణోయ్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..