వాటర్ చెస్ట్‌నట్ దొరికే సీజన్ వచ్చేసింది. శీతాకాలంలో వాటర్ చెస్ట్‌నట్లు కూరగాయలతో పాటు మార్కెట్ లో సందడి చేస్తాయి. ఇవి చిత్తడి నేలలు, చెరువులు, వరి పొలాలు, లోతులేని సరస్సులలో నీటి అడుగున పెరుగుతాయి. కనుక వీటిని వాటర్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వాటర్ చెస్ట్‌నట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. చాలామంది దీనిని ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది వీటిని ఉడకబెట్టుకుని, లేదా సలాడ్ రూపంలో తింటారు. అంటే ఇవి చాలా రకాలుగా తినే ఆహారంలో చేర్చుకుంటారు.