AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela 2025: శరవేగంగా మహాకుంభమేళా ఏర్పాట్లు.. పోలీసులకు ప్రత్యేక శిక్షణ.. మద్యం, మాసం లేని డైట్..

త్రివేణీసంగమం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా నిర్వహణకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మహాకుంభ మేళాను నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు పర్యాటకులు రానున్న నేపధ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మహా కుంభమేళాలో మోహరించే పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు మాంసాహారం, మద్యానికి దూరంగా ఉంటూ మంచిగా ప్రవర్తించాలని సూచించారు.

Kumbh Mela 2025: శరవేగంగా మహాకుంభమేళా ఏర్పాట్లు.. పోలీసులకు ప్రత్యేక శిక్షణ.. మద్యం, మాసం లేని డైట్..
Up Police TrainingImage Credit source: ANI
Surya Kala
|

Updated on: Nov 25, 2024 | 11:54 AM

Share

12 సంవత్సరాల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో 13 జనవరి 2025న పుష్య మాసంలో పౌర్ణమి రోజున మహా కుంభమేళా ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సంగమం.. మత విశ్వాసానికి కేంద్రం అయిన మహా కుంభమేళాలో మోహరించిన పోలీసులకు అనేక రకాల శిక్షణలు ఇస్తున్నారు. ఈ పోలీసు సిబ్బంది ఆహారపు అలవాట్లు, భక్తుల పట్ల ప్రవర్తన.. పరిసరాలపై నిఘా వంటి అనేక అంశాలపై పరేడ్ గ్రౌండ్‌లో క్రమ శిక్షణ ఇస్తున్నారు.

కుంభమేళాకు వచ్చే భక్తుల మనోభావాలను గుర్తెరిగి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాలని.. పోలీసులకు శిక్షణ కార్యక్రమ ఇన్‌ఛార్జ్ అతుల్ సింగ్ చెప్పారు. అంతేకాదు పోలీసులకు 21 రోజుల శిక్షణ మాడ్యూల్‌ను రూపొందించారు. ఈ మాడ్యూల్ కింద 700 మంది పోలీసులతో కూడిన బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు.

మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండేలా శిక్షణ

ఇప్పటివరకు 1,500 మంది పోలీసులకు శిక్షణ పూర్తయిందని శిక్షణ కార్యక్రమ ఇన్‌చార్జి అతుల్ సింగ్ చెప్పారు. అంతేకాదు మొత్తం 40 వేల మంది పోలీసులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మహా కుంభమేళాలో ‘విశ్వాసానికి సేవకులు’గా పనిచేసేందుకు పోలీసులను ప్రోత్సహిస్తున్నారని ఎస్‌ఎస్పీ కుంభ్ రాజేష్ ద్వివేది చెప్పారు. బందోబస్తుతో పాటు యాత్రికులకు సంతోష కరమైన వాతావరణం కల్పించడంపై పోలీసులు దృష్టి సారిస్తారు. పోలీసు మెస్‌ ఈ మహా కుంభమేళా జరిగే సమయంలో ఆహారం పూర్తిగా శాఖాహారంగా మారుతోంది. ఉద్యోగులందరూ భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ పని చేయాలని ఆదేశించారు. దీంతోపాటు మద్యానికి దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

స్నేహితుడిగా పోలీసు కర్తవ్య నిర్వహణ

జాతరలో భద్రతా ఏర్పాట్లతో పాటు మోహరించిన పోలీసుల తీరుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మర్యాదలు, సత్ప్రవర్తనపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. మహోబా హెడ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మేము ఇక్కడకు పోలీసులుగా డ్యూటీ చేయడానికి కాదు, సేవ చేయడానికి వచ్చామని, ఈ సేవ స్ఫూర్తితో కుంభమేళా జరిగే ప్రాంతానికి చేరుకునే ప్రతి ఒక్క పర్యాటకుడు, భక్తుడితో పోలీసులు స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని.. అదే విధంగా వారు కూడా పోలీసుల పట్ల ప్రవర్తించాలని చెప్పారు. అలీగఢ్‌ నుంచి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ శివబరన్‌ మాట్లాడుతూ.. ఇక్కడ డ్యూటీ చేయడం ఓ కలలా ఉందని.. అందరం ఉత్కంఠగా ఉన్నామని, ఇక్కడ డ్యూటీ చేయడంతో పాటు పుణ్యం కూడా ఆర్జిస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..