Fact Check: మీరు SBI రివార్డ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మీ ఖాతాలోకి డబ్బు వస్తాయా? నిజమెంత?

Fact Check: అకౌంట్లో భారీగా డబ్బులు వస్తాయి.. రివార్డ్‌ పాయింట్లను రీడీమ్ చేసుకోవడం ద్వారా మీ అకౌంట్‌లో రూ.9980 క్రెడిట్‌ అవుతాయి..? మీరి ఇది నిజమేనా..? చాలా మందికి ఇలాంటి మెసేజ్‌లు,లింకులు వచ్చాయి.. మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం..

Fact Check: మీరు SBI రివార్డ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మీ ఖాతాలోకి డబ్బు వస్తాయా? నిజమెంత?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 25, 2024 | 12:24 PM

సైబర్ మోసం దేశంలో ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మోసపోతున్నారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సూచిస్తూ ఒక సందేశం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఎస్‌బిఐ రివార్డ్స్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడానికి ఎస్‌బిఐ రివార్డ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని వినియోగదారులకు వాట్సాప్‌లో సందేశం పంపుతోందని వైరల్‌ అవుతోంది.

వైరల్ మెసేజ్‌లో ఏముంది?:

ప్రియమైన విలువైన కస్టమర్, మీ SBI నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ. 9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది! SBI రివార్డ్స్ యాప్‌ను ఇప్పుడే ఇన్‌స్టాల్ చేయండి. అలాగే రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో డబ్బును క్రెడిట్ చేయడం ద్వారా మీరు రివార్డ్‌లను పొందుతారు. థ్యాంక్యూ టీం ఎస్‌బీఐ” అని ఉంది.

ఇవి కూడా చదవండి

ఇందులో నిజమెంత:

టీవీ 9 మొదట వైరల్ సందేశాన్ని పరిశోధించడానికి ఎస్‌బీఐ X హ్యాండిల్‌ను సందర్శించింది. ఎస్‌బీఐ X హ్యాండిల్‌లో వైరల్ సందేశానికి సంబంధించిన ట్వీట్‌ని గుర్తించింది. ఇందులో ఏముందంటే.. “ఎస్‌బిఐ కస్టమర్‌లు శ్రద్ధ వహించండి: మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. SBI రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడానికి మోసగాళ్లు SMS లేదా WhatsApp సందేశాలు, APKలను పంపుతున్నారని మేము గమనించాము. ఎస్‌బీఐ అటువంటి సందేశాలు, APKలను SMS లేదా WhatsApp ద్వారా ఎప్పటికీ షేర్ చేయదని గమనించండి. అటువంటి లింక్‌లను క్లిక్ చేయవద్దు.. తెలియని ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. సురక్షితంగా ఉండండి” అని పేర్కొంది.

ఇది కూడా చదవండి: TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

అందువల్ల మోసగాళ్లు కస్టమర్ల మొబైల్ ఫోన్‌లకు నకిలీ సందేశాలు, APK లింక్‌లను పంపుతున్నట్లు ఈ టీవీ9 ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది. అలాంటి సందేశం పంపలేదని ఎస్‌బీఐ ఖండించింది. అందుకే మీకు అలాంటి లింక్ ఏదైనా కనిపిస్తే దానిపై క్లిక్ చేయకండి. స్కామర్ల పట్ల జాగ్రత్త వహించండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మీ ఫోన్ మాల్వేర్ లేదా వైరస్‌ల బారిన పడే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు.

ఈ తప్పు చేయవద్దు:

తెలియని లింక్‌లు లేదా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు: మీకు ఏదైనా అనుమానాస్పద సందేశం లేదా లింక్ వచ్చినట్లయితే దానిపై క్లిక్ చేయవద్దు లేదా ఏదైనా APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు.

ఫేక్ మెసేజ్‌లను రిపోర్ట్ చేయండి: మీకు అలాంటి మెసేజ్‌లు వస్తే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి. అలాగే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించండి. సైబర్ భద్రతపై శ్రద్ధ వహించండి: విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే మీ ఫోన్ మరియు ఇతర పరికరాల కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి