Plane Braking System: ల్యాండింగ్‌ సమయంలో విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి?

Plane Braking System: విమానం ల్యాండింగ్ సమయంలో వేగం మరింత తగ్గిపోతుంది. ఇంత ల్యాండ్‌ అవుతున్నప్పుడు కూడా విమానం వేగంగానే ఉంటుంది. అలాంటి సమయంలో బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఎలా పని చేస్తుందో తెలుసా? విమానం గాల్లో ఉన్నప్పుడు కూడా బ్రేకులు ఎలా ఉపయోగపడతాయి..? తదితర విషయాలు తెలుసుకుందాం.

Plane Braking System: ల్యాండింగ్‌ సమయంలో విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 25, 2024 | 11:44 AM

విమాన ప్రయాణం చాలా మందే చేసి ఉంటారు. ఈ ప్రయాణం అందరికి సాధ్యం కాకపోవచ్చు. అయతే విమానం ల్యాండింగ్ సమయంలో బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఎలా పని చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ల్యాండింగ్ సమయంలో బ్రేక్‌లు వేసినప్పుడు విమానం బ్రేకింగ్ సిస్టమ్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. విమానం గాల్లో వెళ్లిన తర్వాత వేగంగా ప్రయాణిస్తుంది. ఈ వేగం గంటకు 800 నుంచి 950 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ ల్యాండింగ్ సమయంలో వేగం మరింత తగ్గిపోతుంది. ఇంత ల్యాండ్‌ అవుతున్నప్పుడు కూడా విమానం వేగంగానే ఉంటుంది. అలాంటి సమయంలో బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఎలా పని చేస్తుందో తెలుసా? విమానం గాల్లో ఉన్నప్పుడు కూడా బ్రేకులు ఎలా ఉపయోగపడతాయి..? తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

ల్యాండింగ్ సమయంలో విమానం బ్రేకింగ్ సిస్టమ్:

  1. వింగ్ స్పాయిలర్స్: విమానాల రెక్కలపై వింగ్ స్పాయిలర్లు అమర్చబడి ఉంటాయి. గాలిని ఆపడం ద్వారా విమానం వేగాన్ని తగ్గించడం అవి కీలక పాత్ర పోషిస్తాయి. ల్యాండింగ్ సమయంలో పైలట్లు వాటిని ఓపెన్‌ చేస్తారు. దీని కారణంగా విమానం వేగం తగ్గుతుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ అయినప్పుడు ఈ స్పాయిలర్‌లు ఓపెన్‌ చేస్తారు. తద్వారా వేగాన్ని మరింత తగ్గించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల విమానానికి బ్రేకులు త్వరగా వేయవచ్చు.
  2. డిస్క్ బ్రేకులు: విమానాలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కార్ల బ్రేక్‌ల వలె పని చేస్తాయి. ఇవి చక్రాలకు కనెక్ట్ అవుతాయి. కానీ స్థిరంగా ఉంటాయి. విమానం నేలపై ల్యాండ్ అయినప్పుడు ఈ బ్రేక్‌లు యాక్టివ్‌ చేస్తారు. ఇవి విమాన టైర్లపై ఒత్తిడి పెంచుతాయి. దీని కారణంగా వాటి వేగం తగ్గి విమానం నెమ్మదిగా ఆగిపోతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. రివర్స్ థ్రస్ట్: ఎయిర్‌ప్లేన్ ఇంజిన్‌లు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దీనిని రివర్స్ థ్రస్ట్ అంటారు. సాధారణంగా ఇంజిన్ థ్రస్ట్ వెనుకకు వస్తుంది. దీని కారణంగా విమానం ముందుకు కదులుతుంది. కానీ ల్యాండింగ్ సమయంలో పైలట్లు ఇంజిన్ థ్రస్ట్‌ను రివర్స్ చేస్తారు. దీని కారణంగా థ్రస్ట్ ముందు వైపుకు వస్తుంది. గాలికి వ్యతిరేక దిశలో దాని కదలిక కారణంగా విమానం వేగం చాలా త్వరగా తగ్గుతుంది.
  5. గాలిలో ఎగురుతున్నప్పుడు విమానం బ్రేకింగ్ సిస్టమ్: గాలిలో ఎగురుతున్నప్పుడు బ్రేక్‌లను వేయడానికి ఎయిర్ బ్రేక్‌లను ఉపయోగిస్తారు. ఇవి రెక్కలపై అమర్చబడి గాలి శక్తిని ఆపడం ద్వారా విమానం వేగాన్ని తగ్గిస్తాయి. పైలట్లు ఈ ఎయిర్ బ్రేక్‌లను తెరిచినప్పుడు విమానం వేగం తగ్గుతుంది. అది నెమ్మదిగా ఆగిపోతుంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. 17 రోజుల పాటు బంద్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి