Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. 17 రోజుల పాటు బంద్‌!

Bank Holidays: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి.

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. 17 రోజుల పాటు బంద్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 25, 2024 | 7:32 AM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే వారు ముందస్తుగా ఏయే రోజు బ్యాంకు మూసి ఉంటుందో తెలుకుని వెళ్లడం ముఖ్యం. బ్యాంకుల సెలవుల జాబితా ప్రకారం ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడు నవంబర్‌ నెల ముగియబోతోంది. ఇప్పుడు డిసెంబర్ ప్రారంభం కానుంది. మరో ఐదు రోజుల్లో ఈ నెల గడిచిపోనుంది. గత నెలలో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి. డిసెంబర్‌లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి. వాస్తవానికి డిసెంబర్‌లో పండుగలు ఉండవు. కానీ చాలా ప్రత్యేక రోజులు ఉన్నాయి. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు సందర్భాలలో మూసి ఉండనున్నాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. ఆర్బీఐ నివేదికల ప్రకారం.. డిసెంబర్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.

డిసెంబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా:

  1. డిసెంబర్ 1న ఆదివారం – (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  2. డిసెంబర్ 3న మంగళవారం – (సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే) గోవాలో బ్యాంకులకు సెలవు
  3. డిసెంబర్ 8న ఆదివారం – వారాంతపు సెలవు
  4. డిసెంబర్ 10న మంగళవారం – మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. డిసెంబర్ 11న బుధవారం – (UNICEF పుట్టినరోజు) అన్ని బ్యాంకులకు హాలిడేస్‌.
  6. డిసెంబర్ 14న శనివారం – అన్ని బ్యాంకులకు సెలవు
  7. డిసెంబర్ 15న ఆదివారం – అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు.
  8. డిసెంబర్ 18న బుధవారం – గురు ఘాసిదాస్ జయంతి చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు.
  9. డిసెంబర్ 19న గురువారం – గోవా విమోచన దినోత్సవం ఇక్కడ బ్యాంకులు బంద్‌.
  10. డిసెంబర్ 22న ఆదివారం -సాధారణంగా అన్ని బ్యాంకులు బంద్‌.
  11. డిసెంబర్ 24న మంగళవారం – గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు.
  12. డిసెంబర్ 25న బుధవారం – (క్రిస్మస్) అన్ని బ్యాంకులకు సెలవు
  13. డిసెంబర్ 26న గురువారం – (బాక్సింగ్ డే, క్వాంజా) అన్ని బ్యాంకులకు సెలవు.
  14. డిసెంబర్ 28న శనివారం – నాలుగో శనివారం, అన్ని బ్యాంకులకు సెలవు.
  15. డిసెంబర్ 29న ఆదివారం – సాధారణంగా వారపు సెలవు.
  16. డిసెంబర్ 30న సోమవారం – (తము లోసార్ సందర్భంగా) సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే.
  17. డిసెంబర్ 31న మంగళవారం – (నూతన సంవత్సర వేడుక) మిజోరంలో బ్యాంకులు బంద్

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు ఉపశమనం.. బంగారం ధరలకు బ్రేకులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి