AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్ల పాత కారులోనే అసెంబ్లీ, ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర సీఎం.. ఎక్కడో కాదు భారత్‌లోనే..

రాజకీయ నాయకులు అంటే పెద్ద విల్లాల్లో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే వాళ్ల భోగభాగ్యాలు చెప్పనక్కర్లేదు. కానీ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన సీఎం ను చూస్తే మాత్రం ఇలాంటి నేతలు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తోంది.

20 ఏళ్ల పాత కారులోనే అసెంబ్లీ, ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర సీఎం.. ఎక్కడో కాదు భారత్‌లోనే..
Car
Aravind B
|

Updated on: Mar 15, 2023 | 12:53 PM

Share

రాజకీయ నాయకులు అంటే పెద్ద విల్లాల్లో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే వాళ్ల భోగభాగ్యాలు చెప్పనక్కర్లేదు. కానీ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన సీఎం ను చూస్తే మాత్రం ఇలాంటి నేతలు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తోంది. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన సుక్విందర్ సింగ్ సుక్కూ డిసెంబర్ 2022లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి ఓ డ్రైవర్ గా పనిచేసేవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సుక్విందర్ సింగ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడంతో ఇటీవల వార్తల్లో నిలిచి మరింత పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో మొదటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన సీఎం సుక్విందర్ సింగ్ తన 20 ఏళ్ల పాత కారులో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇలా రావడానికి కారణం ఏంటని అడగగా తాను 2003 లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ కారే వినియోగిస్తున్నానని, ఎక్కడికి వెళ్లిన ఇందులోనే తిరుగుతానని చెప్పారు. ఇందులో తిరుగుతున్నప్పుడు తన పాత రోజులు గుర్తుకు వస్తాయన్నారు. ఆయన అలా పాత కార్లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీఎం సుక్విందర్ సింగ్ పై చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం సుక్విందర్ సింగ్ ఉదయం నడకకు వెళ్లేటప్పడు భద్రత సిబ్బంది లేకుండానే స్థానికులతో కలిసి మాట్లాడారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా సెక్యూరిటీ లేకుండా తిరగడంతో ఆశ్చర్యపోయామని అక్కడి స్థానికులు తెలిపారు. జనవరి 24న బిల్సాపూర్ జిల్లాకు వచ్చినప్పుడు ఓ సాధారణ హోటల్ కి వెళ్లారు. అక్కడికి రోజు వారిగా వినియోగదారులతోనే కలిసి తిన్నారు. రాజకీయాల్లో అంతపెద్ద స్థాయికి వెళ్లాక కూడా సాధాసీదాగా జీవితం గడపుతూ అక్కడి ప్రజలకి మరింత చేరువవుతున్నారు సుక్విందర్ సింగ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..